వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకం

Jan 8 2026 9:30 AM | Updated on Jan 8 2026 9:30 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకం ఏప్రిల్‌లోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం 9న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా వెలుగొండ విద్యుత్‌ బకాయిలు రూ.107 కోట్లు

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బుధవారం పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల వారిని ప్రకటించారు. రాష్ట్ర లీగల్‌ సెల్‌ సెక్రటరీలుగా మార్కాపురానికి చెందిన ఉడుముల నారాయణరెడ్డి, ఒంగోలుకు చెందిన కత్తి కోటేష్‌బాబు, రాష్ట్ర స్టూడెంట్‌ వింగ్‌ సెక్రటరీగా కొండపికి చెందిన దగ్గుమాటి రాజమోహనరెడ్డి, రాష్ట్ర బూత్‌ కమిటీ వింగ్‌ సెక్రటరీగా కొండపికి చెందిన పాటిబండ్ల వేణుగోపాల్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

ఒంగోలు వన్‌టౌన్‌: ఎస్సీ కార్పొరేషన్‌లోని వివిధ పథకాల ద్వారా రుణాలు తీసుకున్న వారు ఏప్రిల్‌లోపు తిరిగి పూర్తిగా చెల్లిస్తే రుణంపై వడ్డీని మాఫీ చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మంజూరైన పథకాలకు సంబంధించిన రుణాలు పొందిన లబ్ధిదారులు కోవిడ్‌–19 కారణంగా తిరిగి కట్టలేకపోయారన్నారు. ఆ రుణాలు తిరిగి చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు.

ఒంగోలు సిటీ: జిల్లాలోని టైప్‌ 3, టైప్‌ 4 కింద కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది ఖాళీలను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి ఈ నెల 11వ తేదీ లోపల వచ్చిన దరఖాస్తులను సమగ్రశిక్షా కార్యాలయంలో అందజేయాలని అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ దాసరి అనీల్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో టైప్‌–3 కింద ఖాళీ పోస్టుల వివరాలు వరుసగా ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ 8, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ 12, ఏఎన్‌ఎంలు 5, అకౌంటెంట్లు 3, అటెండర్లు 1, హెడ్‌కుక్‌ 1, అసిస్టెంట్‌ కుక్‌లు 9, డే వాచ్‌ఉమెన్‌ 1, స్కావెంజర్లు 3 చొప్పున మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. అలాగే టైప్‌ 4 కింద వార్డెన్లు 12, పార్ట్‌టైమ్‌ టీచర్లు 9, చౌకీదార్‌ 8, హెడ్‌కుక్‌ 10, అసిస్టెంట్‌ కుక్‌ 22 చొప్పున మొత్తం 61 ఖాళీలు ఉన్నాయి. 45 సంవత్సరాల లోపు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు.

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 9న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీ మార్ట్‌, బీఎస్‌ఈల్‌, శ్రీ చక్ర హ్యుందాయ్‌ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , శ్రీరామ్‌ చిట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, విజన్‌ ఇండియా సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్యాకింగ్‌–పికింగ్‌, ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, సిస్టమ్‌ ఆపరేటర్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ సెక్టార్‌ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేస్తారన్నారు. టెన్త్‌, ఇంటర్మీడియేట్‌, ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు జీతం నెలకు రూ.12 వేల నుంచి రూ.22 వేల వరకు, పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకం ఇస్తారని తెలిపారు. జిల్లాలోని 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇంటర్వ్యూకు ఆధార్‌ కార్డు, సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని తెలిపారు.

మార్కాపురం: మార్కాపురం జిల్లా పరిధిలోని పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న టన్నెల్‌ విద్యుత్‌ బకాయిలు రూ.107 కోట్లకు పెరిగాయి. విద్యుత్‌ అధికారులు నోటీసులు ఇస్తున్నా స్పందన లేదని తెలుస్తోంది. కొండలా పెరిగిపోతున్న విద్యుత్‌ బకాయిలు ఎలా వసూలు చేయాలో విద్యుత్‌శాఖ అధికారులకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై మార్కాపురం విద్యుత్‌శాఖ ఈఈ నాగేశ్వరరావును వివరణ కోరగా బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement