పచ్చని దోపిడీ !
తెల్లరాయి..
ఏ ఖనిజం వెలికితీయాలన్నా గనుల శాఖ అనుమతి తప్పనిసరి. కానీ, అధికార టీడీపీ నేతలకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వేస్తున్నారు. అడ్డగోలు దోపిడీతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో లభ్యమయ్యే తెల్లరాయికి ఎలక్ట్రానిక్ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో అక్రమంగా మైనింగ్ చేస్తూ రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. సహజ వనరుల్ని దోచేస్తున్నా గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కనీసం అటువైపు తొంగి చూడకపోవడం విస్తుగొలుపుతోంది.
వెలికితీసిన తెల్లరాయి


