పోలినేనిచెరువు కేంద్రంగా...
వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువు గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని నెల్లూరుకు చెందిన కొందరు వ్యాపారులు పెద్ద ఎత్తున తెల్లరాయి తవ్వకాలకు పాల్పడుతున్నారు. గ్రామ పరిధిలో రెవెన్యూ భూముల్లో ఈ మైనింగ్ జరుగుతోంది. వీరికి నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేత సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కూడా ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీంతో ఈ అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు అభ్యంతరాలు చెబుతున్నారు. అయినాసరే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


