త్వరలో ప్రతి డిపోలో ఆర్‌ఓ ప్లాంట్
● ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి
అద్దంకి: ప్రతి ఆర్టీసీ డిపోలో త్వరలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గ్యారేజీలోని వర్కర్లు, స్వీపర్లకు యూనిఫాం, స్వెట్టర్లను పంపిణీ చేశారు. తరువాత సీనియర్ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలో 1300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. ప్రతి డిపోలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2020 నుంచి పనిచేస్తూ మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగం ఇవ్వడం లేదా వారికి ఆర్థిక ప్రయేజనం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్గో ద్వారా రూ.200 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. డిపో మేనేజర్ రామ్మోహనరావు, గ్యారేజ్ సిబ్బంది, వర్కర్లు, పాల్గొన్నారు.


