జగన్ ఒక్కరే
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సీఎం
కురిచేడు: 2019 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పొట్లపాడులో వేంచేసి ఉన్న గుత్తికొండ రామయోగి స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మాట్లాడారు. వారికి దారిపొడవునా మహిళలు పూలు చల్లుతూ హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తిరునాళ్లకు వచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మాయమాటలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మన పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయిందని, మరో మూడేళ్ల ఆగితే మన ప్రభుత్వం వస్తుందని, ప్రతి ఒక్కరికీ తగిన గుణపాఠం చెపుదామని చెప్పారు. దొనకొండ, కురిచేడు మండలాల పార్టీ కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తుల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, నాయకులు నుసుం ప్రతాప్‌రెడ్డి, నుసుం గోవిందారెడ్డి, నుసుం ఆరుద్రరెడ్డి, మహానందరెడ్డి ఉన్నారు.


