వీరేపల్లి పద్మకు వైవీ, నాయకుల నివాళులు | - | Sakshi
Sakshi News home page

వీరేపల్లి పద్మకు వైవీ, నాయకుల నివాళులు

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

వీరేప

వీరేపల్లి పద్మకు వైవీ, నాయకుల నివాళులు

కొత్తపట్నం: వైఎస్సార్‌ సీపీ నాయకుడు, విశ్రాంత వీఆర్వో వీరేపల్లి రామచంద్రారెడ్డి సతీమణి పద్మ గత నెల 16వ తేదీ మరణించారు. శనివారం కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో నిర్వహించిన పెద్ద కర్మకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి హాజరై పద్మ చిత్రపటానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు వైవీ భద్రారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్ల మెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పల్లప్రోలు మల్లికార్జున్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం జోనల్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ల రవీంద్రరెడ్డి, ఈతముక్కల మాజీ సర్పంచ్‌ దాసూరి గోపాల్‌రెడ్డి, శ్రీమన్నారాయణ, కటారి శంకర్‌, దుంపా చెంచిరెడ్డి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నాయుడు, పాలడుగుల రాజీవ్‌ ఉన్నారు. పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించారు. పార్టీ అండగా ఉంటుందని పద్మ కుటుంబ సభ్యులకు వైవీ సుబ్బారెడ్డి ధైర్యం చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులు వి.వెంకట సుబ్బారెడ్డి, వి.ప్రమీల, వి.మదన్‌మోహన్‌రెడ్డి, వి.శశికళ, బద్దేల రమేష్‌రెడ్డి, వి.శ్రీధర్‌రెడ్డి, వి.శ్రీవిధ్య, వి.కార్తికేయరెడ్డి పాల్గొన్నారు.

వెంకట్రామిరెడ్డికి వైవీ సుబ్బారెడ్డి నివాళులు

మద్దిపాడు: వైఎస్సార్‌ సీపీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి తండ్రి, ఎంపీపీ వాకా అరుణ మామ అయిన వాకా వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన సోదరుడు వైవీ భద్రారెడ్డి దంపతులు, పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితర ప్రముఖులు ఇనమనమెళ్లూరు చేరుకుని వెంకట్రామిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్దిపాడు ఎంపీడీఓ వి.జ్యోతి, నాగులుప్పలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, పార్టీ నాయకులు బి.వెంకటేశ్వర్లు, కేవీ రమణారెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, కొమ్మూరి కనకారావు మాదిగ,దుంపా యలమందారెడ్డి, పాకనాటి మహానందరెడ్డి, పల్లపాటి అన్వేష్‌, నాదెండ్ల మహేష్‌, కంకణాల సురేష్‌, పైడిపాటి వెంకట్రావు, బొమ్మల దాసు, బెజవాడ రాము, బొమ్మల రామాంజనేయులు, మేరుగు పద్మ, రాయపాటి విల్సన్‌, నారా సుబ్బారెడ్డి, పాలడుగు రాజీవ్‌, పులి వెంకటరెడ్డి, రాంబాబు, గ్రామ నాయకులు ఆకుల శ్రీను, నైనాల శశ్రీను, కోటి, గద్దె జాలయ్య, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించారు.

వీరేపల్లి పద్మకు వైవీ, నాయకుల నివాళులు 1
1/1

వీరేపల్లి పద్మకు వైవీ, నాయకుల నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement