అందుకే బీజేపీలో చేరేందుకు బాబు ప్రయత్నాలు: వైవీ సుబ్బారెడ్డి | Yv Subba Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

అందుకే బీజేపీలో చేరేందుకు బాబు ప్రయత్నాలు: వైవీ సుబ్బారెడ్డి

Sep 3 2023 11:22 AM | Updated on Sep 3 2023 11:27 AM

Yv Subba Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడనే ఐటీ నోటీసులిచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధంగా దొంగ ఓట్లు చేర్పించారో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

‘‘జమిలి ఎన్నికలు వచ్చినా.. సాధారణ ఎన్నికలు వచ్చినా ప్రజలు మాత్రం మళ్లీ సీఎం జగన్‌నే ఎన్నుకుంటారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే సత్తాలేదు.. అందుకే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వేషాలు వేసినా.. ఎంత మందితో కలిసి వచ్చినా. మళ్లీ వచ్చేది సీఎం జగన్‌ ప్రభుత్వమే’’ అని ఆయన స్పష్టం చేశారు. లోకేష్‌ తన పాదయాత్రలో సీఎంను దుర్భాషలాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశ్యపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: కాళ్ల బేరం ఖరీదెంత? 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement