టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం

YSRCP MLA Jogi Ramesh Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

సాక్షి, తాడేపల్లి: కరోనా కష్టకాలంలో వాలంటీర్లు అద్భుత సేవలందించారని.. వారు వాలంటీర్లు కాదని, వారియర్స్‌ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని, నిత్యం ఒక సైన్యంలా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వాలంటీర్లను చప్పట్లు కొట్టి ప్రజలు అభినందిస్తే టీడీపీ నేతలు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని జోగి రమేష్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయినా ఉనికి కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్‌ యాప్‌ల ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్ట్రకాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారని దుయ్యబట్టారు. టీడీపీ ఇప్పటికే భూస్థాపితమైన పార్టీ‌ అని, టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమైందని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. (చదవండి: ‘అక్రమాలకు వాళ్లు అన్నదమ్ములు’)

ప్రభుత్వ స్థలాన్ని సబ్బం హరి ఆక్రమించుకున్నారని, చర్యలు తీసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. ‘‘టీడీపీ నేత పట్టాభి కారు అద్దం పగిలితే.. టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ నుంచి ప్రతి ఒక్కరూ ట్వీట్లు, ఖండనలు ఇస్తున్నారు. కారు అద్ధాలు పగిలిదే మాకేం సంబంధం. వాళ్ల రాళ్లు వారే వేసుకుని ఇలా చవకబారు ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలుస్తాం. ఉద్దేశ పూర్వకంగా, కుట్ర పూరితంగా వ్యవహరించారని తేలితే చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తప్పవు. రథాలు తగలబెడతారు.. విగ్రహాలు ధ్వంసం చేస్తారు.. వీళ్ళే ఆందోళనలు చేస్తారు. ఈ ఘటనలకు స్క్రీన్ ప్లే , దర్శకత్వం చంద్రబాబే’’ అని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని, ప్రతిపక్ష హోదా కూడా పోయే సమయం వచ్చిందన్నారు.

‘‘సీపీఐ రామకృష్ణ క్యాపిటలిస్టుగా మారిపోయారు. కమ్యూనిస్టులు సిద్దాంతం వదిలేసి చంద్రబాబు పంచన చేరారు. కొన్ని ఘటనలు జరిగితే పని గట్టుకుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని’’ ధ్వజమెత్తారు. కక్ష సాధింపులు తమ ప్రభుత్వంలో ఉండవని, పని గట్టుకుని వైఎస్సార్‌సీపీ దాడి చేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో స్థానాన్ని పొందారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా  వైఎస్‌ జగన్‌ని ప్రజల నుంచి వేరు చేయలేరని జోగి రమేష్‌ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top