టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్‌ | Ysrcp Leader Sailajanath Comments On Tdp Mahanadu | Sakshi
Sakshi News home page

టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్‌

May 27 2025 11:35 AM | Updated on May 27 2025 12:43 PM

Ysrcp Leader Sailajanath Comments On Tdp Mahanadu

సాక్షి అనంతపురం : టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించింది చంద్రబాబే.. టీడీపీకి వారసుడు ఎవరు?. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు.

జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు’’ అంటూ శైలజానాథ్‌ మండిపడ్డారు.

పేదల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్‌నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు: Sailajanath

 

 

Advertisement
 
Advertisement
Advertisement