సీఎం రమేష్‌కు గుడివాడ అమర్నాథ్ సవాల్ | Ysrcp Leader Gudivada Amarnath Challenge To Cm Ramesh | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్‌కు గుడివాడ అమర్నాథ్ సవాల్

Oct 11 2026 1:31 PM | Updated on Oct 11 2026 3:00 PM

Ysrcp Leader Gudivada Amarnath Challenge To Cm Ramesh

సాక్షి, విశాఖపట్నం: సీఎం రమేష్‌ ఓడిపోతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. సీఎం రమేష్‌కు ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం అనకాపల్లి ఎంపీగా పోటీ చేద్దాం. నేను ఎంపీగా ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. సీఎం రమేష్ ఓడిపోతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి. సీఎం రమేష్ దోపిడీలు చూసి ఈ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు’’ అంటూ గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.

సీఎం రమేష్ పోటీ చేయాలంటే 30 పార్టీల మద్దతు అవసరం. నేను వైఎస్సార్సీపి తరఫున పోటీ చేస్తాను.. సారా రమేష్‌తో నాకు పోలిక ఏంటి?. గతంలో నా తండ్రి మీద కూడా ఇలాగే సవాల్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీగా తన తండ్రి విజయం సాధించారు. జెడ్పీటీసీగా పోటీ చేస్తే స్క్రూట్నీలో సీఎం రమేష్ పోతాడు. ఆయన ఓటు కడప జిల్లాలో ఉంది. కనీసం అవగాహన లేకుండా సీఎం రమేష్ మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉంటే గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది. ప్రస్తుతం నీ పరిస్థితి అదే.’’ అంటూ  అమర్నాథ్‌ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: బాబు సర్కార్‌ నిర్వాకం.. రైతుకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement