నిందలు వేసే ముందు షర్మిల ఆలోచించుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి | Sakshi
Sakshi News home page

నిందలు వేసే ముందు షర్మిల ఆలోచించుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి

Published Thu, Jan 25 2024 1:34 PM

YS Subba Reddy Serious Comments Over Congress Sharmila - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, వైవీ సుబ్బారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీ చేస్తాం. చంద్రబాబులా బీజేపీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు క్షమించరు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన కారణం. 

అమరావతి పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. విశాఖ రాజధాని కాకుండగా కేసులు వేసింది కూడా చంద్రబాబే.  చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు. పదవి కోసం ఎన్టీఆర్‌ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారు. ఇప్పుడు షర్మిలను చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారు. వైఎస్సార్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టింది. మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. 

ఇదే సమయంలో ఎన్నికలకు సమాయత్తమవ్వాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి అధిక స్థానాలు గెలిచే ప్రయత్నం చేయాలన్నారు. పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. తరగపువలస సమీపంలొ జరిగే వైఎస్సార్‌సీపీ సభను మనం విజయవంతం చేయాలన్నారు. రాష్ర్టవ్యాప్తంగా సంకేతం పంపే విధంగా సభ ఉండాలన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement