‘కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే కర్ఫ్యూ’.. యోగి తీవ్ర విమర్శలు | Yogi Adityanath Says Congress Gave Biryani To Terrorists And Imposing Curfew In Its DNA - Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే కర్ఫ్యూ’.. యోగి తీవ్ర విమర్శలు

Published Mon, Apr 8 2024 8:53 AM

Yogi Adityanath says Congress imposing curfew in its DNA - Sakshi

జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన విమర్శలు చేశారు. రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘దేశానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద సమస్య. కర్ఫ్యూలు విధించటం  కాంగ్రెస్‌  డీఎన్‌ఏలో ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమతిస్తే.. కాంగ్రెస్‌ ఉగ్రవాదులకు జైలులో బిర్యానీ పెట్టింది. బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లలో ఒకరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బీజేపీ అభ్యర్థులను ప్రటించిన తర్వాత మొదటిసారి రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

‘రామమందిరం నిర్మాణం పక్కనపెడితే.. ముందు  శ్రీరాముడు, కృష్ణుడిని కాంగ్రెస్‌ ఊహాజనిత వ్యక్తులుగా భావించింది. కాంగ్రెస్‌ పాలన​లో పేదల హక్కులు హరించారు. ప్రస్తుతం దేశం మొత్తం మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని నినాదం చేస్తుంది.  గత పదేళ్లలో  ప్రధాని మోదీ పరిపాలనలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయి. గతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు జరిగేవి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్‌ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి సహసం చేయటం లేదు. ఎందుకుంటే వారికి వైమానిక దాడి భయం ఉంది. ప్రస్తుతం ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం లేదు. దేవం నక్సలిజం, ఉగ్రవాదం, కశ్మీర్‌లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గించాం’ అని యోగి అన్నారు.

‘కాంగ్రెస్‌ పా​ర్టీ దేశంలో ప్రజలు ఆకలితో ఉంటే ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టారు. అదే ప్రధాని మోదీ గత నాలుగేళ్లుగా దేశంలో 80 కోట్ల మంది  పేదలకు ఉచిత రేషన్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి సిద్దాతం, బలమైన నేత లేరు. కాంగ్రెస్‌లోనే  చాలా సమస్యలు ఉన్నాయి.  మీరు వేసే ఓటు రామ మందిర నిర్మాణానికి మద్దతు మాత్రమే కాదు. మన దేశ సరిహద్దులకు కచ్చితమైన రక్షణ’అని  యోగి తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement