బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-5) | Will Chandrababu Answer Questions On Backward Classes Welfare | Sakshi
Sakshi News home page

బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-5)

Feb 20 2024 7:58 PM | Updated on Feb 20 2024 8:01 PM

Will Chandrababu Answer Questions On Backward Classes Welfare - Sakshi

‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్‌ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.

లేస్తే మనిషిని కానన్నట్టుగానే. అందుకే... ఐదేళ్లుగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి తన వల్ల మంచి జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయమని ధీమాగా చెబుతున్నారు. జగన్‌ అది చేశారా? ఇది చేశారా? అని పచ్చమంద నోరు పారేసుకునే ముందు.. ఒక్కసారి ఈ ప్రశ్నలకు జవాబు ఉందేమో చూసుకోండి!

  • చిరుద్యోగులకు జీతాలు పెంచకుండా అవమాన పరిచిన మాట వాస్తవం కాదా బాబూ
  • నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ స్వయంగా హెచ్చరించలేదా బాబూ?
  • ఆశా వర్కర్లు, అంగన్‌ వాడీలు జీతాలు పెంచమంటే వారి ఉద్యోమాలను అణిచేయలేదా బాబూ
  • నీ హయాంలో నాయా బ్రాహ్మణులకు, రజకులకు, దర్జీలకు ఎందుకు పథకాల్లేవు బాబూ?
  • ఇప్పుడు ఈ వర్గాలకు వైఎస్‌.జగన్‌ ఏడాదికి పది వేల రూపాయల చొప్పున సాయం అందిస్తుండం వాస్తవం కాదా బాబూ?
  • చిరుద్యోగులకు వేతనాలు పెంపుదల ద్వారా సీఎం జగన్‌ ఆదుకోవడం నిజం కాదా బాబూ?
  • అంగన్‌ వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికల మూడు నెలల వరకూ రూ.౭వేలు ఉంటే, రూ.11,500కు పెంచారు. హెల్పర్ల జీతాలు రూ.4వేలు నుంచి రూ.7వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?
  • గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్‌ జీతాలను రూ.2వేల నుంచి రూ.10వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?
  • మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ
  • ఆశావర్కర్ల జీతాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?
  • గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?
  • పోలీస్‌ శాఖలో పనిచేసే హోంగార్డుల జీతాలు రూ.18వేల నుంచి రూ.21,300కు పెంచడం వాస్తవం కాదా బాబూ?
  • పాఠశాల విద్యాశాఖలో కుక్‌ కం హెల్పర్లు రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?
  • 108 సర్వీసుల డ్రైవర్ల జీతాలను రూ.13వేల నుంచి రూ.28వేలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను

రూ. 17,500 నుంచి రూ.20వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?

  • 104 డ్రైవర్ల జీతాలను రూ.26వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ
  • ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8వేల నుంచి రూ.16 వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ?

చిరుద్యోగులను ఎవరు ఆదుకున్నారో? ఎవరు మోసం చేస్తారు చర్చకు సిద్దమా బాబూ?

  • ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘ కాలిక డిమాండ్ పై ఏం చేశారు?
  • అమరావతి పరిధి లో చంద్ర బాబు, ఆయన బినామీల భూముల ధరలను అమాంతంగా పెంచుకోడానికి విజయవాడ వెస్ట్ బై పాస్ రోడ్డు (గొండి గొలను నుంచి కాజా టోల్ ప్లాజా వరకూ బై పాస్ రోడ్డు) ను నిర్మాణాన్ని ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేశారు కాదా... ?

చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-4)

చదవండి:   బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-3)

చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-2)

చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-1)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement