సాక్షి, తాడేపల్లి: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మహ్మద్ రుహుల్లా, డాక్టర్ మెహబూబ్ షేక్, షరీఫ్, దస్తగిరి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు. అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ జగన్.. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ సేవలు చిరస్మరణీయం అన్నారు.
‘‘విద్యాభివృద్ధికి, లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయం. అబుల్ కలామ్ ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయని విశ్వసించిన గొప్ప దార్శనికుడు.
..విద్య అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ ప్రగతికి, దేశాభివృద్ధికి పునాది అని ఆజాద్ బలంగా విశ్వసించారు. ఆయన ఆలోచనలు భావితరాలకు మార్గదర్శకం. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం విద్యారంగానికి ఆయన అందించిన సేవలకు నిదర్శనం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏజెంట్ వైఎస్.. ఓటర్ ఓఎస్ !
భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించిన మహనీయుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని విశ్వసించి, ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పించేందుకు జీవితాంతం కృషి చేసిన గొప్ప దార్శనికుడు ఆయన. దేశ ప్రగతికి, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన ఆజాద్ గారి జయంతి సందర్భంగా నివాళులు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2026


