వైఎస్సార్‌సీపీ గెలిచిన చాలా చోట్ల ఫలితాలు తారుమారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Serious Comments On Chandrababu Over Election Process | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గెలిచిన చాలా చోట్ల ఫలితాలు తారుమారు: వైఎస్‌ జగన్‌

Nov 11 2026 12:54 PM | Updated on Nov 11 2026 12:59 PM

YS Jagan Serious Comments On Chandrababu Over Election Process

సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్‌ పర్సంటేజీ నమోదు అయ్యేదని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

పలు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు ఈరోజు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై వారితో వైఎస్‌ జగన్‌ చర్చించారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘ఎన్నికల కోసం పార్టీ కేడర్‌ అంతా కసితో గట్టిగా పోరాటం చేశారు. చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారు. వారికి కూడా బాగా అర్థమైంది. 2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఓటింగ్‌ శాతాలు పెరిగాయి. ఎన్నికల షెడ్యూల్‌ దగ్గర నుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతీ దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్‌ శాతం పెరిగింది. సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్‌ పర్సంటేజీ నమోదయ్యేది. ఇది బయటకు వస్తే, తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే చంద్రబాబు అరాచకాలు చేశాడు.

ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారు. ఇవన్నీ దాటుకుని విజయాలు సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి, ఫలితాలు తారుమారు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నిందలు మోపి, లేని అబద్ధాలు చెప్పి, ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు, అక్రమాలను చంద్రబాబు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్ల పేరిట చాలా వరకు వైఎస్సార్‌సీపీ ఓట్లు తీసేశారు. లెక్కింపు కేంద్రాల్లో కరెంటు ఆపి మరీ ఫలితాలు తారుమారు చేశారు’ అంటూ విమర్శలు చేశారు.

పార్టీ నాయకుల మాట్లాడుతూ..‘మా రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లను పెట్టారు. అభ్యర్థుల బంధువులను కిడ్నాప్‌ చేసి, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారు. చెల్లని ఓట్ల పేరిట చాలా వరకు వైఎస్సార్‌సీపీ ఓట్లు తీసేశారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌లు చేసి, లెక్కలు తారుమారు చేశారు. వైఎస్సార్‌సీపీ అడిగిన చోట రీకౌంటింగ్‌లు మాత్రం చేయలేదు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి, వారిని గెలిపించేలా అక్రమాలు చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా ప్రతీ గ్రామంలో చంద్రబాబు బాధితులు ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: కాకినాడ జెడ్పీ పీఠంపై టీడీపీ కన్ను.. జనసేనకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement