తుమ్మల ఫైర్‌.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు | Telangana Elections 2023: Thummala Nageswara Rao Sensational Comments On Puvvada Ajay Kumar - Sakshi
Sakshi News home page

తుమ్మల ఫైర్‌.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు

Oct 21 2023 3:45 PM | Updated on Oct 21 2023 4:58 PM

Thummala Sensational Comments On Puvvada Ajay Kumar - Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్‌ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేసి సంచలన ఆరోపణలు చేశారు. 

కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆ‍త్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో మంత్రి అజయ్‌ కుమార్‌ను కాశీం రజ్వీతో పోల్చారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్‌ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్‌ కుమార్‌ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచి పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement