
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన విచారణ వాయిదా పడింది. నేడు నలుగురు ఎమ్మెల్యేలను విచారిస్తామని ప్రకటించిన స్పీకర్, చివరికి ఇద్దరినే విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తిప్పి తిప్పి ప్రశ్నలు అడగడంతో సమయం పూర్తయ్యింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణకు తగిన సమయం లేకపోవడంతో, విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ రోజు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్యల విచారణ పూర్తయింది. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విచారణ వాయిదా పడింది.