ముందు సొంత పార్టీని చక్కదిద్దుకోండి | Telangana: Ponguleti Sudhakar Reddy Comments On Congress Party Leaders | Sakshi
Sakshi News home page

ముందు సొంత పార్టీని చక్కదిద్దుకోండి

Sep 24 2021 1:32 AM | Updated on Sep 24 2021 1:32 AM

Telangana: Ponguleti Sudhakar Reddy Comments On Congress Party Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందుగా సొంత పార్టీని చక్కదిద్దుకున్నాక ప్రధాని మోదీపై, బీజేపీపై విమర్శలు చేస్తే మంచిదని కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే విపక్షాలు ఒక్కటై విమర్శలు సంధిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీపై, బీజేపీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను ఖండిస్తున్నామన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధనస్వామ్యం వర్ధిల్లుతోంది కాబట్టి తమ పార్టీ కొన్ని ఎన్నికల్లో ఓడిపోవచ్చునేమోనని వ్యాఖ్యానించారు. దేశంలో రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు, విపక్షాలు భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నాయా అని పొంగులేటి ప్రశ్నించారు. కేంద్రంలో విపక్షాలు కలలో కూడా అధికారంలోకి రాలేవని ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement