కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం? ఏం జరుగుతోందంటే? | Sonia Gandhi proposes TMC Congress merger | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం? ఏం జరుగుతోందంటే?

Jun 10 2026 6:43 PM | Updated on Jun 10 2026 8:58 PM

 Sonia Gandhi proposes TMC Congress merger

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

టీఎంసీ అంతర్గత అసంతృప్తి, ప్రముఖ నేతల నిష్క్రమణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల ముందు పార్టీ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. సోనియా గాంధీ విలీన ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.

జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ నుంచి టీఎంసీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే ఆందోళనను సోనియా గాంధీ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో విలీనం జరిగితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని, బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుందని ఆమె సూచించినట్టు చెబుతున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ, మమతా బెనర్జీ మధ్య చర్చ జరిగినట్టు సోర్సెస్‌ పేర్కొన్నాయి. టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి, వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.

మమత ఏమన్నారు? 
మమతా బెనర్జీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల గడువు కోరినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరిగితే అనుసరించాల్సిన విధానాన్ని కాంగ్రెస్ నాయకత్వం వివరించింది. ఆ ప్రతిపాదన ప్రకారం.. మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వవచ్చని, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం.

అయితే, ఇలాంటి ప్రతిపాదన నిజంగా ఉందా? లేదా? అన్న విషయంపై కాంగ్రెస్, టీఎంసీ నుంచి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. పార్టీ భవిష్యత్ దిశ, అభిషేక్ బెనర్జీ పాత్రపై టీఎంసీలో అసంతృప్తి ఉన్నట్టు వస్తున్న వార్తల మధ్య ఈ ఊహాగానాలు వెలువడ్డాయి.

అభిషేక్ బెనర్జీ-రాహుల్ గాంధీ భేటీపై ఆసక్తి
ఈ రాజకీయ పరిణామాలపై మరింత ఆసక్తి రేపేలా అభిషేక్ బెనర్జీ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సమావేశం సానుకూలంగా సాగిందని తెలుస్తోంది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమావేశం గంటన్నర కంటే అధిక సమయం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement