ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ | Telangana Government Greenlights Adilabad Airport Project | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Jul 26 2026 7:39 PM | Updated on Jul 26 2026 7:45 PM

Telangana Government Greenlights Adilabad Airport Project

హైదరాబాద్‌: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,278.14 కోట్లకు పరిపాలనా అనుమతి, 2,009.23 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. IAF కోసం 1,609.23 ఎకరాలు, సివిల్ ఏవియేషన్‌కు 400 ఎకరాలు వాడనుంది. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తారు. 

MRO, కార్గో, ప్యాసింజర్ సేవలకు ఎయిర్‌పోర్ట్ రూపకల్పన ఉండనుంది. భూసేకరణ, రోడ్ల మళ్లింపు, విద్యుత్ టవర్ల తొలగింపునకు నిధులు వాడతారు. హైటెన్షన్ లైన్లు, నీటి వనరుల మార్పునకు ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారు. 2026 డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement