కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ | Scenes Of Police Attack On Mla Kethireddy Pedda Reddy House Have Gone Viral | Sakshi
Sakshi News home page

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌

Published Fri, May 17 2024 9:05 AM | Last Updated on Fri, May 17 2024 10:47 AM

Scenes Of Police Attack On Mla Kethireddy Pedda Reddy House Have Gone Viral

సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.

పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్‌పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్‌సీపీ లీగల్‌ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement