రాజీనామా చెయ్‌! ఎమ్మెల్యేకు సభికుల సమాధానం | Sailana MLA Kamleshwar Dodiyar Resignation Video Controversy | Sakshi
Sakshi News home page

రాజీనామా చెయ్‌! ఎమ్మెల్యేకు సభికుల సమాధానం

Nov 17 2026 7:37 AM | Updated on Nov 17 2026 7:37 AM

Sailana MLA Kamleshwar Dodiyar Resignation Video Controversy

రత్లాం(మధ్య ప్రదేశ్): యథాలాపంగా ‘రాజీనామా చేయమంటారా చెప్పండి, చేస్తాను’అన్న ఎమ్మెల్యేకు, ‘చేసెయ్‌’అంటూ సభికుల నుంచి బదులు రావడంతో అత్యంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆదివాసీ వీరుడు బిర్సాముండా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సమీపంలోని రాణీసింగ్‌ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. భారత్‌ ఆదివాసీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కమలేశ్వర్‌ దోడియార్‌ ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి తన రాజీనామా అంశాన్ని లేవనెత్తారు. 

‘‘ఎన్నికల్లో నెగ్గాక అసెంబ్లీలో ఇతర ఎమ్మెల్యేలతో ఎందుకు కలిసి కూచుంటున్నావని మీరు నన్నడగవచ్చు. దానికి నా సమాధానం ఒక్కటే. అసెంబ్లీలో మేమేమో మొత్తం 230 మందిమి. అందరికీ కలిపి ఉన్నది ఒక్కటే ద్వారం. సీట్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. నన్నేం చేయమంటారు? రాజీనామా చేయనా? చెప్పండి, చేసేస్తా’’అన్నారు. దాంతో, తక్షణం చెయ్యమంటూ సభికుల్లో చాలామంది అరుపులు కేకలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement