కేసీఆర్‌జీ కాళేశ్వరంలో ఎంత దోచావు: రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌జీ కాళేశ్వరంలో ఎంత దోచావు: రాహుల్‌ గాంధీ

Published Sun, Nov 26 2023 2:42 PM

Rahul Gandhi Comments At Sangareddy Andole Public Meetings  - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ‘కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. మీరు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ చేశావని కాంగ్రెస్ ఆరోపిస్తోంది’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఢిల్లీలో మోదీకి బీఆర్‌ఎస్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మోదీ పరస్పర మద్దతుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. కాంగ్రెస్‌ను ఓడించడానికే బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి’ అని రాహుల్‌ మండిపడ్డారు. 


‘కాంగ్రెస్‌ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నేను ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టారు. కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతిస్తున్నారు. కేసీఆర్‌ ఎంత అవినీత చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది. నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా. కేసీఆర్‌ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు’ అని రాహుల్‌ విమర్శించారు.

ఆంథోల్‌ సభలో మాట్లాడుతూ..

‘దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ జరుగుతోంది. కేసీఆర్‌ చదువుకున్న స్కూల్‌ కాంగ్రెస్‌ కట్టించిందే. ప్రపంచంలోనే ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేసింది. కేసీఆర్‌.. మీ చేతిలోనే ధరణి ఉంది. పేదల నుంచి 20  లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారు. నిన్న రాత్రి తెలంగాణ యువకులతో కలిసి మాట్లాడా. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు రావడం లేదు. ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి. కేసీఆర్‌ దోచుకున్న డబ్బులు ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. చాతి ముందుకు పెట్టుకుని తిరిగే వారి, కారు టైర్‌లో గాలి తీసేది కాంగ్రెస్‌ పార్టీయే’ అని రాహుల్‌ తెలిపారు. 

ఇదీచదవండి..వారిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టింది: మంత్రి కేటీఆర్‌

Advertisement
Advertisement