ఆప్తమిత్రులకు గోల్డెన్‌ పాస్‌పోర్టా?: రాహుల్‌

Rahul attacks govt on Cyprus golden passport scheme - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ అన్న వినోద్‌ అదానీ సహా 66 భారతీయులు సైప్రస్‌ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌’ మంజూరు చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అమృత్‌కాల్‌లో ఆప్తమిత్రులైన ఆ సోదరులిద్దరూ దేశం విడిచి ఎందుకు వెళ్లారు? గోల్డెన్‌ పాస్‌పోర్టు అంటే ప్రజాధనాన్ని దోచుకుని, డొల్ల కంపెనీలు పెట్టుకుని, విదేశాల్లో జల్సా చేసేందుకు బంగారంలాంటి అవకాశం’అని బుధవారం రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో ఎద్దేవా చేశారు.

రాహుల్‌ ఆరోపణలపై బీజేపీ దీటుగా స్పందించింది. సైప్రస్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రోగ్రామ్‌ లేదా గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌ పథకాన్ని 2007లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేసింది. పన్ను ఎగవేతదారులకు లాభించేలా సైప్రస్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ విధానంపై నియంత్రణలు తీసుకువచ్చామని పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top