మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఖాకీల ఓవరాక్షన్‌ | Police Overreaction Against Former Mp Nandigam Suresh | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఖాకీల ఓవరాక్షన్‌

May 29 2025 4:28 PM | Updated on May 29 2025 5:30 PM

Police Overreaction Against Former Mp Nandigam Suresh

ఫైల్‌ ఫోటోలు

సాక్షి, తాడేపల్లి: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ ఎంపీపై అమానవీయ చర్యకు పోలీసులు దిగారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఆయనను పోలీసులు హింసిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో మాజీ ఎంపీని విచారించాలన్ని హైకోర్టు చెప్పింది. అయితే, ఆ మేరకు విచారణ కొనసాగడం లేదు.

జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయనను పోలీసులు లాకప్‌లోనే ఉంచుతున్నారు. ఇది హైకోర్టు ధిక్కరణే అని న్యాయవాదులు అంటున్నారు. నందిగం సురేష్‌కు ఖాకీలు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. తుళ్లూరు పోలీసుల తీరుపై మేజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement