
కుంచాల సవీంద్రరెడ్డి ( భార్య లక్ష్మీ ప్రసన్న)
సాక్షి, గుంటూరు: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. వారిపై వేధింపులు ఆగడం లేదు. తాడేపల్లి పోలీసులమంటూ సోషల్ మీడియా కార్యకర్త కుంచాల సవీంద్రరెడ్డిని తీసుకెళ్లారు. ఆయన భార్య.. తాడేపల్లి పీఎస్‌కు వెళ్లి వివరాలు అడగ్గా.. సవీంద్రారెడ్డిని తాము తీసుకెళ్లలేదంటూ సమాధానమిచ్చారు. పోలీసులమంటూ తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని తాడేపల్లి పీఎస్‌లో సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేశారు.
సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. గత మార్చి నెలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డి, వర్రా రవీంద్రరెడ్డి, ఇంటూరి రవికిరణ్, పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరమణారెడ్డిలపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.