కేరళ: రాహుల్‌గాంధీపై ప్రధాని సెటైర్లు | Sakshi
Sakshi News home page

కేరళ: రాహుల్‌గాంధీపై ప్రధాని సెటైర్లు

Published Mon, Apr 15 2024 3:11 PM

Pm Modi Comments On Rahulgandhi And Left Government In Kerala - Sakshi

తిరువనంతపురం: ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల పాలనలో కేరళ పరిస్థితి దిగజారిపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని పాలక్కాడ్‌లో సోమవారం(ఏప్రిల్‌ 15) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్‌ నుంచి కేరళ దాకా లెఫ్ట్‌ ప్రభుత్వాలు ఎక్కడున్నా ఒకేలా వ్యవహరిస్తాయని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ యువరాజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓట్లడుగుతాడు. కానీ కేరళ పజలకు ఉన్న ఒక్క సమస్యపైనా మాట్లాడడు’ అని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధాని చురకంటించారు. మరోపక్క బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై సోమవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు.    

ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై రాహుల్‌గాంధీ విమర్శలు 

Advertisement
 
Advertisement