‘అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తింటాడు’ | Perni Nani Slams On Chandrababu Over Seeking BJP Support | Sakshi
Sakshi News home page

‘అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తింటాడు’

Feb 9 2024 12:18 PM | Updated on Feb 9 2024 2:46 PM

Perni Nani Slams On Chandrababu Over Seeking BJP Support - Sakshi

కృష్ణా: బీజేపీతో చంద్రబాబు అర్ధరాత్రి చర్చలు నడిపారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

‘2014లో ఏపీ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్నాడు. బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగాడు. నాలుగేళ్లు కాపురం చేసి చివరి ఆరునెలల్లో బీజేపీపై చంద్రబాబు బూతులు తిట్టాడు. ప్రధాని మోదీకి భార్యలేదన్నాడు. కుటుంబం కూడా లేనోడు నాతో పోటీనా అన్నాడు. ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో అన్నాడు.  బీజేపీతో ఎందుకు కలిసి పోటీచేయాలో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి.

..బీజేపీ కొత్తగా ఏపీకి రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చిందా? రైల్వే జోన్ ఇచ్చిందా? పోర్టు నిర్మాణం పూర్తిచేసిందా? కడప స్టీల్ ప్లాంట్ కట్టిందా? పోలవరం పూర్తి చేయించి ఇచ్చిందా?  నిర్వాసితులకు ఈరోజుకీ నయాపైసా ఇవ్వలేదు. ఏపీలో ఒక్కపోర్టు నిర్మాణంలోనైనా సాయం చేశారా?  దోసెడు పట్టి.. చెంబుడు నీరు ఇచ్చారని చంద్రబాబే చెప్పాడు.

..అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడు. ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకోవాలని చూస్తున్నాడు. బీజేపీ, చంద్రబాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా?  సిగ్గు.. ఎగ్గులేకుండా జనం మధ్యకు వస్తారా? సమాధానం చెప్పాలి’ అని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement