ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి | Opposition propaganda should be countered | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

Jun 15 2023 3:20 AM | Updated on Jun 15 2023 3:20 AM

Opposition propaganda should be countered - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతి­పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైఎస్సార్‌­సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అనుబంధ విభాగాలైన వైఎస్సార్‌ డాక్టర్స్, క్రిస్టియన్, మైనారిటీ, ప్రచార, చేనేత విభాగాల అధ్యక్షులు, జోనల్‌ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షు­లతో విజయసాయిరెడ్డి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై టీడీపీ, దాని అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో కృత్రిమంగా ప్రజావ్యతిరేకతను సృష్టించే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభు­త్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని సాగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదన్నారు.

గత ప్రభుత్వా­నికి.. ఈ ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఏపీలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచాయనే విష­యాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. వివిధ రాష్ట్రాల అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి వెళ్తున్నారని చెప్పారు. పార్టీ కమిటీలను త్వరగా భర్తీ చేసి.. 2024 అధికారమే లక్ష్యంగా పనిచేయా­లని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శల­కు క్షేత్రస్థాయిలోనే తగు రీతిలో కౌంటర్‌ ఇవ్వాలన్నారు. 

అనుబంధ విభాగాలకు ముగ్గురేసి ఉపాధ్యక్షులు
పార్టీ అనుబంధ విభాగాలకు ముగ్గురు చొప్పున ఉపాధ్య­క్షు­లను నియమిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ పటిష్టతకు రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా, 8 జోన్లుగా విభజించినట్టు చెప్పారు. రాష్ట్ర పార్టీ విభాగానికి అధ్యక్షుడు ఉంటారని, అధ్యక్షుడుతో పాటుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి ఒక ఉపాధ్యక్షుడు, కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఒక ఉపాధ్యక్షుడు, రాయలసీమ జిల్లాల నుండి ఒక ఉపాధ్యక్షుడు చొప్పున నియమిస్తామని చెప్పారు.

ఈ ముగ్గురు పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షుడి కింద పని చేస్తారన్నారు. ఈ సమావేశాల్లో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , డాక్టర్ల విభాగం అధ్యక్షుడు బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, క్రిస్టియన్‌ మైనారిటీ విభాగ అధ్యక్షుడు మేడిది జాన్సన్, ప్రచార విభాగ కమిటీ అధ్యక్షుడు ఆర్‌.ధనుంజయ రెడ్డి, చేనేత విభాగ అధ్యక్షుడు గంజి చిరంజీవి పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement