మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం! | Nadendla Manohar Photo Missing in Burripalem Meeting | Sakshi
Sakshi News home page

మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం!

Oct 5 2026 12:54 PM | Updated on Oct 5 2026 1:36 PM

Nadendla Manohar Photo Missing in Burripalem Meeting

గుంటూరు: రూరల్‌ మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణంలో అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సభా వేదికపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఫొటోను ప్రొటోకాల్‌ అధికారులు ఏర్పాటు చేయడం మరిచారు. విషయాన్ని తెలుసుకున్న జనసేన నేతలు అధికారుల దష్టికి తీసుకువెళ్లడంతో ఆగమేఘాలపై అరగంట  తరువాత మంత్రి మనోహర్‌తో కూడిన ఫొటోను వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పొందుపరిచారు.

హెలీప్యాడ్‌ ప్రాంగణానికి వెళ్లేందుకు ఆ గ్రామ రైతులు, టీడీపీ ముఖ్య నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి, చివరకు చేసేది లేక అక్కడి నుంచి నిష్క్రమించారు. ఒకానొక దశలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్నిసార్లు హెలీప్యాడ్‌ ప్రాంగణానికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కష్టపడి పనిచేసే వారికి ఇటువంటి అవమానాలు తప్పవని సీనియర్‌ నాయకుల ఎదుట ఒకింత అసహనం వ్యక్తం చేసింది. హెలీప్యాడ్‌ ప్రాంగణానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటే, దాదాపు 80 మంది వివిధ మార్గాల గుండా రావడంతో ఎన్‌ఎస్‌జీ కమెండోలు పలువురిని పక్కకు తోశారు. వీరిలో జనసేన నాయకులు ఉన్నారు.  

ఆలస్యంగా సీఎం ప్రసంగం 
మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు  త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేసి సభా ప్రాంగణానికి వెనుదిరిగి వచ్చారు.  ఒంటి గంట దాటినా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాలరీల దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనేక అపశ్రుతుల మధ్య చంద్రబాబు బహిరంగ సభ కొనసాగింది.  సభ ముగియడంతో ప్రజలు ‘బతికిపోయాంరా బాబు’ అంటూ బయటకు వచ్చారు. తీవ్ర ఉక్కపోత, ఎండ  తట్టుకోలేక సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు.  

రైతులను అడ్డుకుంటున్న పోలీసులు  

ఇదీ చదవండి: నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్‌.. పీఆర్‌ పీక్స్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement