‘నువ్వా విలువల గురించి మాట్లాడేది’.. అనితపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌ | MLC Varudu Kalyani Fires On Home Minister Vangalapudi Anitha, More Details Inside | Sakshi
Sakshi News home page

‘నువ్వా విలువల గురించి మాట్లాడేది’.. హోంమంత్రి అనితపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌

Jun 8 2025 7:18 PM | Updated on Jun 9 2025 12:45 PM

MLC Varudu Kalyani Fires On Home Minister Vangalapudi Anitha

సాక్షి,విశాఖ : హోంమంత్రి అనితపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైరయ్యారు.  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదని,ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. 

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి నుంచి స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోం మంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు. సాక్షి డిబేట్‌లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఆ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను మా పార్టీ ఎంత మాత్రం సమర్ధించదు.

రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేదు. వైఎస్‌ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదు. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోం మంత్రి అనిత ఏం చేశారు..? కనీసం స్పందించారా..? ఈ కుటుంబాలను ప్రభుత్వం ఓదార్చిందా..?. విలువలు నేర్పించే అర్హత హోం మంత్రి అనితకు ఉందా..? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇది. హోం మంత్రి సొంత ఇలాకాలో గంజాయి రవాణా జరుగుతుంది. ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు’ అని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement