Minister Niranjan Reddy Comments On BJP Leaders - Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌

Oct 28 2021 11:53 AM | Updated on Oct 28 2021 5:29 PM

Minister Niranjan Reddy Comments On BJP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు.

‘‘రైతుల అభివృద్ధి కోస​​​​​ం కట్టుబడి ఉన్నాం. వారి కోసం​ రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతులకు ఉచిత విద్యుత్‌, రైతుబ​ంధు ఇస్తున్నాం. ఎక్కడికక్కడ  కొనుగోలు కేంద్రాలు పెట్టి  ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. వరి సాగు, వరి కొనుగోలు చేయటం లేదని బండి సంజయ్ దీక్షలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రచారం చేయాలని ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనలేమని, బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్ర మంత్రి చెప్పారు. తెలంగాణ నుండి ఒక్క గింజ కొనం అని నిస్సిగ్గుగా చెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement