వాటిని కూడా ఆపెయ్యమంటరేమో?: కేటీఆర్‌ | Minister KTR Slams Congress Party Over Ruling | Sakshi
Sakshi News home page

అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా?

Oct 26 2023 10:08 AM | Updated on Oct 26 2023 10:36 AM

Minister KTR Slams Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌.  కాంగ్రెస్‌ అంటేనే.. రైతు విరోధి అనే విషయం మరోసారి రుజవైందంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ లో ట్వీట్‌ చేశారు. 

అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడాతెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. (చదవండి: మజ్లిస్‌ పార్టీలో ‘చార్మినార్‌ అసెంబ్లీ సీటు’ చిచ్చు)

ఇంటింటికి మంచినీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? , రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.జై కిసాన్.. జై తెలంగాణ..!!జై కేసీఅర్.. జై బీఆర్ఎస్..!!!’ అని పోస్ట్‌ పెట్టారు మంత్రి కేటీఆర్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement