Amalapuram Issue: Minister Botsa Satyanarayana Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

Konaseema Issue: అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర: మంత్రి బొత్స

May 26 2022 4:32 PM | Updated on May 26 2022 6:22 PM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, శ్రీకాకుళం: చంద్రబాబు దివాళాకోరు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ మంత్రి, ఎమ్మెల్యేపై తాము దాడి చేయిస్తామా అని ప్రశ్నించారు. మామపై రాళ్లు వేయించి.. అల్లర్లు సృష్టించిన చరిత్ర మాది కాదన్నారు.
చదవండి: అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు

అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉంది. అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని’’ మంత్రి బొత్స అన్నారు. పవన్‌కల్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. తుని ఘటనపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా? ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని’’ మంత్రి బొత్స హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement