టీడీపీ-జనసేన-బీజేపీది అనైతిక పొత్తు: మంత్రి అంబటి | Minister Ambati Rambabu Comments On TDP Janasena And BJP Alliance For AP Assembly Elections - Sakshi
Sakshi News home page

టీడీపీ-జనసేన-బీజేపీది అనైతిక పొత్తు: మంత్రి అంబటి

Mar 9 2024 6:18 PM | Updated on Mar 9 2024 7:11 PM

Minister Ambati Rambabu Comments On Tdp Janasena And Bjp Alliance - Sakshi

టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమిత్‌షాపై రాళ్లు వేసిన చరిత్ర చంద్రబాబుది. పాచిపోయిన లడ్డూ ఇచ్చారని కేంద్రాన్నిపవన్‌ విమర్శించారు. ఇప్పుడు అదే బీజేపీతో జత కలిశారు’’ అని మండిపడ్డారు.

‘‘సీఎం జగన్‌ సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందరు కలిసి వచ్చినా గెలుపు వైఎస్సార్‌సీదే. చంద్రబాబు, లోకేష్‌ కలిసి పవన్‌ను పక్కనపెట్టారు. పవన్‌ ముఖ్యమంత్రి రేసులో ఇక లేరు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ అమిత్‌షా కాళ్లపై పడ్డారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు. హామీ ఇస్తే సీఎం జగన్‌ తప్పక నెరవేరుస్తారు. ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చరు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
 

 ఇదీ చదవండి: జగన్‌ ఏంటో చెప్పడానికి విశాఖ చాలదా!

Advertisement
 
Advertisement
Advertisement