ఇటీవల నిర్వహించిన సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో కూడా మేమంతా పాల్గొన్నా. కావాల్సిన పత్రాలన్నీ సమర్పించా. ఎప్పుడు పిలిచినా వస్తామని చెబుతున్నా. గ్రామంలోనే అందుబాటులో ఉన్నా. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఓటు తొలగించారు. నేను దాదాపు ప్రతి ఎన్నికలోనూ ఓటు వేశాను. న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించ బట్టి కలెక్టర్ వరకు వెళ్లాం. న్యాయం చేయండి.
– అన్నవరపు కృష్ణ చైతన్య, మన్నవ గ్రామస్తుడు
అయ్యా ఇంతటి దారుణాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మన్నవలో నేను నాలుగుసార్లు సర్పంచిగా పనిచేశాను. ఎన్నికల నోటిఫికేషన్ వరకు కూడా నేనే సర్పంచిని. నా కుటుంబం 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. మా కుటుంబం మొత్తం ఓట్లు తొలగించారు. రాజకీయాల్లో ఉండకుండా చేయాలని టీడీపీ నాయకుల కుట్రలో భాగమే. పొన్నూరు తహసీల్దార్, బీల్వోలు ఈ కుట్రలో భాగస్వాములు. ఒక్క గ్రామంలో దాదాపు 379 ఓట్లు తొలగించడం ఇదే ప్రథమమేమో. స్థానిక టీడీపీ నాయకుడు బండ్లమూడి చింపిరయ్య మా ఓట్లు తొలగించమని ఒకే వ్యక్తి 175 ఫాం–7లు దాఖలు చేస్తే దానిని అధికారులు అంగీకరించారు.
–బొనిగల నాగమల్లేశ్వరరావు, మన్నవ తాజా మాజీ సర్పంచి


