తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) సంయుక్తంగా కార్పొరేట్ – ఇనిస్టిట్యూషన్ అనుసంధాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించాయి. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాలు, సంయుక్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నూతన ఉత్పత్తుల అభివృద్ధి, విద్యార్థులకు పరిశ్రమల ఆధారిత ప్రాజెక్టులు అందించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ బృందంలో డీప్‌ల్యూర్ వ్యవస్థాపకులు, సీఈఓ హర్షవర్ధన్, స్పేస్‌ఇన్ఫ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీదేవి తాళ్లూరి, ఎక్స్‌పాట్రానిక్స్ సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వంశీ చరణ్ రాపోలు, గ్రోవ్యూ సహ వ్యవస్థాపకులు రఘు వేగిరాజు, ఐఓటీ ఆధారిత రైడర్ సేఫ్టీ మానిటరింగ్ సిస్టమ్ వ్యవస్థాపకులు గౌతమ్, రెట్రోనర్జీస్ వ్యవస్థాపకులు దీపేష్ కుమార్ పాల్గొన్నారు. వర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథివర్మ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసి, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి, స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అదనపు డీన్ హరికిరణ్, ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎన్.వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.పవన్ కుమార్, ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, పారిశ్రామికవేత్తల అభివృద్ధి కేంద్రం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ వి.రాజేష్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.సలీమ్ అక్రమ్, ఆర్టీఐహెచ్ ప్రతినిధి డాక్టర్ కె.వి.జి.నాయుడు, ఫ్యాబ్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ కపూర్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ వి.రమాకాంత్, గణేష్ రాయల పాల్గొన్నారు.


