రాజకీయ కక్షల కోసం ఓట్లు తొలగిస్తారా..! | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షల కోసం ఓట్లు తొలగిస్తారా..!

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

గుంటూరు జిల్లా కలెక్టర్‌ వద్ద ఆవేదన

మీ ప్రభుత్వాలు తప్పితే ఎవ్వరూ ఉండకూడదా

అధికారులు కుమ్మకై ్క రాజ్యాంగ హక్కును లాక్కున్నారు

మన్నవలో 379 ఓట్లు అక్రమంగా తొలగింపు

గుంటూరు వెస్ట్‌: చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం పచ్చని పల్లెలను వదలడంలేదు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిస్సిగ్గుగా తొలగించి అధికారులు వేడుక చూస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్భలంతో ఓట్ల నాటకం ఆడుతున్నారు. మన్నవలో ఇటీవల వరకు 1780 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య ఒక్కసారిగా 1361 పడిపోయింది. అంటే ఒక్కసారిగా 379 ఓట్లు గల్లంతు అయ్యాయి. గత ఎన్నికల్లో మన్నవ గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థిపై 400 ఓట్లతో తేడాతో విజయం సాధించారు. ఈసారి మన్నవ గ్రామ సర్పంచి పదవిని ఎలాగైనా కై వసం చేసుకునేందుకు టీడీపీ పన్నాగం వేసింది. 379 ఓట్లు తొలగించారు. గ్రామ ప్రజలు కొన్ని నెలలుగా కోల్పోయిన ఓటు హక్కు కోసం చేయని ప్రయత్నాలు లేవు. చివరకు న్యాయస్థానాల ఆదేశాలతో సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో బాధితులు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మను కలిసి వివరాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement