బాబు గుండెల్లో ఐటీ భయం | Merugu Nagarjuna comment on Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు గుండెల్లో ఐటీ భయం

Sep 4 2023 6:16 AM | Updated on Sep 4 2023 6:16 AM

Merugu Nagarjuna comment on Chandrababu - Sakshi

ఒంగోలు: ప్రజాబాహుళ్యంలో దొరికిన దొంగ చంద్రబాబు అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఆయన ఆదివారం ఒంగోలులో  ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు.నోటీసులు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ఎటువంటి నోటీసులు ఇచ్చినా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం పరిపాటేనన్నారు.

తాజాగా ఐటీశాఖ నోటీసులు జారీచేయడంతో బాబు గుండెల్లో భయం పట్టుకుందని చెప్పారు. దీంతో బీజేపీ పంచన చేరి ఏదో ఒక విధంగా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకుని మరీ వినయాన్ని నటిస్తున్నారని విమర్శించారు. చివరికి పురందేశ్వరి ద్వారా ఢిల్లీ పెద్దల ప్రాపకం కోరుతున్నారన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement