లోక్‌సభ అభ్యర్థికి పాలాభిషేకం! | Manish Kashyap Contest from West Champaran | Sakshi
Sakshi News home page

Bihar: లోక్‌సభ అభ్యర్థికి పాలాభిషేకం!

Apr 10 2024 1:27 PM | Updated on Apr 10 2024 1:51 PM

Manish Kashyap Contest from West Champaran - Sakshi

బీహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆయన ఆ ప్రాంతంలో విరివిగా పర్యటిస్తూ, ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో మనీష్ కశ్యప్‌కు కొందరు మహిళలు పాలాభిషేకం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య ఒక కేసులో చిక్కుకుని,ఇటీవలే జైలు నుంచి విడుదలైన మనీష్ కశ్యప్  ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.  కొత్త బీహార్‌ను సృష్టించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మనీష్ చెబుతున్నారు. 

తూర్పు చంపారన్ జిల్లా బంజరియా బ్లాక్‌లోని రతన్‌పూర్ గ్రామానికి మనీష్ కశ్యప్ ప్రచారానికి వచ్చిన సందర్భంగా అక్కడి మహిళలు అతనికి పాలాభిషేకం చేశారు. మనీష్ కశ్యప్  ఎన్నికల పర్యటనలో ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనీష్ కశ్యప్‌ను చూసేందుకు జనం తరలివస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement