దేశంలోని బంకీపూర్, మంజల్‌పూర్, దతియా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్‌పై విజయం సాధించారు.
అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ గెలిచారు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఓడించారు.
గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్) విజయం సాధించారు. ఆయనకు మొత్తం 55,481 ఓట్లు పడగా 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భిఖంభాయి రబారీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు మొత్తం 61677 ఓట్లు రాగా, 11,054 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీకి ఇప్పటివరకు 50,623 ఓట్లు వచ్చాయి.


