ఖమ్మం రేసులో డిప్యూటీ సీఎం భార్య.. ఎంపీ టికెట్‌కు దరఖాస్తు

Mallu Bhatti Vikramarka Wife Nandini Applied For Khammam Mp Ticket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ, ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు.

దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్త చేశారు. దేశంలో రాహుల్  ప్రధాని కావడం ఖాయమని నందిని అన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ఇదీ చదవండి: టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌!

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top