ఢిల్లీ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రద్దు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్. ఆమెపై తెలంగాణలో ఎటువంటి కేసులు లేకపోయినా కేసులు ఉన్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం, ఆపై మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించడం జరిగిపోయాయని,. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు.
ఈరోజు(గురువారం, జూన్ 11వ తేదీ) ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి మహేష్‌కుమార్ గౌడ్ హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు సాగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ దేశంలో తాజా రాజకీయపై చర్చించాం. పెట్రోల్ , డీజిల్, గ్యాస్,నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది.
వీసీలుగా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వారు చాలా మంది ఉన్నారు. మీనాక్షి నటరాజన్ పై పెద్దలకు వివరణ ఇచ్చాను. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసు లేదు. నోటీస్ మాత్రమే వచ్చింది.. నోటీస్ విషయాలు మెన్షన్ చేయాలనీ నామినేషన్ పత్రాల్లో ఎక్కడా లేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక రోజు ముందు నోటీస్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మా పార్టీ నుండి ఎవరు చెప్పలేదు. రాజకీయ కక్షతో నామినేషన్‌ని తిరస్కరించారు. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు’ అని పేర్కొన్నారు.


