Lalu Prasad Yadav Plays Badminton Months After Surgery - Sakshi
Sakshi News home page

Lalu Prasad Yadav: అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ‍్మింటన్ ఆడుతూ..

Jul 29 2023 4:42 PM | Updated on Jul 29 2023 9:25 PM

Lalu Yadav Plays Badminton Months After Surgery - Sakshi

ఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. నవ్వుతూ ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తన తండ్రి దేనికి తలవంచరని పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ప్రశ్నించకుండా ఉండేందుకే తన తండ్రిపై కేంద్ర ప్రభుత్వం అవినీతి కేసులను మోపిందని ఆరోపించారు. 'ఆయనకు భయం అంటే ఎంటో తెలియదు. దేనికీ భయపడరు. ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. చివరికి తప్పక విజయం సాధిస్తారు' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


 
పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య కారణాల వల్ల బెయిల్‌పై విడుదలయ్యారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. ఆయన కుమార్తె ఒక కిడ్నీని దానం చేయగా చికిత్స పూర్తి అయింది. గతేడాది డిసెంబరులో శస్ర్త చికిత్స అనంతరం దిల్లీకి తిరిగి వచ్చారు.

ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు..

Advertisement
 
Advertisement
Advertisement