breaking news
plays
-
కేజీఎఫ్ బ్యూటీ చేతిలో చంటిపాప.. మనసు నిండిపోయిందంటూ..
-
రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ..
ఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. నవ్వుతూ ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తన తండ్రి దేనికి తలవంచరని పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రశ్నించకుండా ఉండేందుకే తన తండ్రిపై కేంద్ర ప్రభుత్వం అవినీతి కేసులను మోపిందని ఆరోపించారు. 'ఆయనకు భయం అంటే ఎంటో తెలియదు. దేనికీ భయపడరు. ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. చివరికి తప్పక విజయం సాధిస్తారు' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. View this post on Instagram A post shared by Tejashwi Yadav (@tejashwipdyadav) పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య కారణాల వల్ల బెయిల్‌పై విడుదలయ్యారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. ఆయన కుమార్తె ఒక కిడ్నీని దానం చేయగా చికిత్స పూర్తి అయింది. గతేడాది డిసెంబరులో శస్ర్త చికిత్స అనంతరం దిల్లీకి తిరిగి వచ్చారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. -
ఉద్దానంపై బాబు కపట నాటకం
-
సమాజపు దృశ్య కావ్యాలు..‘నంది’ నాటకాలు
కర్నూలు(కల్చరల్) : ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న అనేకానేక దురాచారాలు, దురాగతాలు, వాటిపై తిరుగుబాట్లు, పరిష్కారాలు, గుణపాఠాలు... వీటన్నింటికీ దృశ్య కావ్యాలుగా నంది నాటకాలు నిలిచాయి. కుటుంబం, సమాజంలో దిగజారిపోతున్న విలువలు... పతనమవుతున్న మానవతా దృక్పథం... అత్యున్నత విలువల వైపు పయనించవలసిన ఆవశ్యకత... తెలియజేస్తూ నంది నాటకాల ప్రదర్శన జరిగింది. నంది నాటకోత్సవాల్లో భాగంగా మూడో రోజున స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ఐదు నాటికలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు జస్ట్ స్మైల్ తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘మానవ బ్రహ్మ’ సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి కుటుంబం పుత్రుడు కావాలనే ఆరాటపడటం, ఆ పుత్రుడు తమ ఆశయాలకు అనుగుణంగా ఎదగకపోతే ఆవేదన చెందడం, ఇదీ నడుస్తున్న చరిత్ర. మానవ బ్రహ్మ నాటిక ఈ నడుస్తున్న చరిత్రకు దర్పణం పడుతూ ప్రతి తండ్రీ ఒక బ్రహ్మలాంటివాడని, పుత్రులను ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు తండ్రులు బ్రహ్మలా వ్యవహరించాల్సిన అవసరముందని ఈ నాటిక తెలియజేసింది. ఈ నాటకాన్ని పల్లేటి లక్ష్మీకులశేఖర్ రచించగా డాక్టర్ జె.రవీంద్ర దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యం చాటిన కృష్ణబిలం... కళాంజలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన కృష్ణబిలం నాటిక భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని చాటిచెప్పింది. కృష్ణబిలం అంటే బయటినుంచి వచ్చే ఏ పదార్థాన్నైనా రెట్టింపు వేగంతో విసిరివేయడం, అంతర్గత పదార్థానికి రక్షణ ఇవ్వడం. సరిగ్గా భారతీయ సంస్కృతిలో ఈ లక్షణాలే నిబిడీకృతమై ఉన్నాయని ఈ నాటిక చాటిచెప్పింది. విదేశీ సంస్కృతిలో మానవ సంబంధాలు పలుచగా ఉంటూ తల్లిదండ్రులు, బిడ్డలకు మధ్య ప్రేమాభిమానాల స్థానంలో అగాథాలు ఏర్పడతాయి. కానీ భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఒక విడదీయరాని అనుబంధం ఉంటుంది కానీ అపారమైన ఎడబాటు ఉండదు. ఈ విలువలను కాపాడు కోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పిన ఈ నాటికకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఆకురాతి భాస్కరచంద్ర రచించారు. సనాతన విలువలకు ప్రతీకగా ‘నాయకురాలు నాగమ్మ’... సత్కళాభారతి హైదరబాద్ నాటక సమాజం ప్రదర్శించిన ‘నాయకురాలు నాగమ్మ’ నాటిక పురుషాధిక్యతను ఎదుర్కొన్న తీరుతెన్నులను ప్రదర్శించింది. కరీంనగర్ జిల్లా ఆర్వేలి గ్రామంలో పుట్టిపెరిగిన ఒక స్త్రీమూర్తి యదార్థగాథకు నాటకీయ రూపమే ఈ నాటిక. నాయకురాలు నాగమ్మ అపారమైన మేధస్సుతో పురుషులకు దీటుగా నడిపిన రాజకీయ మంత్రాంగం ఇప్పటికీ ఆదర్శప్రాయం. నాగమ్మ కథను కళ్లకు కట్టినట్లుగా చిత్రించిన ఈ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్.ఎస్.నారాయణబాబు రచించిన ఈ నాటకానికి డాక్టర్ కోట్ల హనుమంతరావు దర్శకత్వం వహించారు. కనువిప్పు కల్గించిన నాటిక ‘చట్టానికి కళ్లున్నాయి’... రసరంజని మేకా ఆర్ట్స్ హైదరబాద్ నాటిక సమాజం ప్రదర్శించిన ‘చట్టానికి కళ్లున్నాయి’ నాటిక కనువిప్పు కల్గించే దృశ్యాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వెంగళరెడ్డి అనే ఫ్యాక్షనిస్టు జైలులో ఉన్నా తన అనుచరులతో తన దుర్మార్గాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తుండగా ఒక కార్యాలయంలోని ఉద్యోగి తిరుగుబాటు చేసి చట్టానికి కళ్లున్నాయని నిరూపించిన ఇతివృత్తమే ఈ నాటిక. ఫ్యాక్షనిస్టులు అధికారులను లోబరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక ఉద్యోగి దానిని తుదముట్టించేందుకు సిద్ధమవుతాడని ఈ నాటిక చాటిచెప్పింది. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. చక్కని సందేశాత్మక నాటిక ‘ఖాళీలు పూరించండి’... కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వైజాగ్ నాటక సమాజం ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ప్రస్తుత సమాజంలో పౌరులు నేరస్తుల గురించి సమాచారం పోలీసులకు చేరవేయకుండా తమకు తామే శిక్ష విధించుకుంటున్నారని తెలియజేసింది. మోహన్, విశ్వం, మాయ, బాబా పాత్రల మధ్య జరిగిన సన్నివేశాలు అత్యంత ఉత్కంఠతను కల్గించాయి. నేరస్తులను పోలీసులకు పట్టించడం, శిక్ష పడేటట్లు చేయడం పౌరులు అలవర్చుకోవాలనే సందేశాన్ని ఈ నాటిక అందించింది. ఉదయ్ భాగవతుల ఈ నాటిక రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. -
చాక్‌పీస్‌తో ఆడుకున్నాడని...
విద్యార్థిని చితకబాదిన టీచర్ లంగర్‌హౌస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘటన హైదరాబాద్: తరగతి గదిలో చాక్‌పీస్‌తో ఆడుకున్నాడనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని చితకబాదాడు. ముందటి పళ్లు ఊడేలా కొట్టాడు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు వెన్ను విరగొట్డాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివాసముండే ప్రీతిబాల, మహేశ్ యాదవ్‌ల కుమారుడు తనిష్క్ యాదవ్ (11). బాపూఘాట్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లి గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. తనిష్క్ గురువారం తరగతి గదిలో ఉండగా తోటి స్నేహితుడు అతనిపై చాక్‌పీస్ విసిరాడు. అదే చాక్పీస్ను తనిష్క తిరిగి ఆ విద్యార్థిపై పడేశాడు. ఇది గమనిం చిన టీచర్ సుధీర్ ఆగ్రహంతో ఊగి పో యి తనిష్క్‌ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టా డు. విషయం తెలుసుకున్న స్థాని కులు, బాలుడి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరింత కోపం పెంచుకున్న సుధీర్ శుక్రవారం పాఠశాలకు వచ్చిన తనిష్క్‌పై అకారణంగా దాడికి దిగాడు. వెన్నుపూస భాగంలో తీవ్రంగా కొట్టడంతో బాలుడు కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు బాలుడిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
అవకాశం వస్తే నాటకాలు వేస్తా : గిరిబాబు
నాంపల్లి: అవకాశం వస్తే నాటకాలు వేసేం దుకు సిద్ధంగా ఉన్నానని సినీనటుడు గిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో మాధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. సినిమాలు, టీవీలు వచ్చాక నాటక రంగం మరుగున పడిందన్నారు. నాటరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అం దరూ ముందుకు రావాలన్నారు. తాను నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చానన్నారు. అవకాశం వస్తే నాటకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాళ్లపల్లి వేంకట నరసింహారావు పుట్టిన రోజును పురస్కరించుకుని నాటకరంగంలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రతి ఏటా ఒక్కరిని ఎంపిక చేసి నగదు పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారని అన్నారు. ఈ పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి ఎ.విజయలక్ష్మికి అందజేశారు. సభకు అధ్యక్షత వహిం చిన ప్రముఖ రంగస్థల ప్రయోక్త డాక్టర్ చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ మా ధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్‌ను స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత రావి కొండలరావు, సినీ నటులు కాకినాడ శ్యామల, శివపార్వతి, ప్రముఖ కవి దుగ్గిరాల సోమేశ్వరరావు, ప్రముఖులు మొదలి నాగభూషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర మంచి పార్థసారధి రచించిన తల్లా వఝ్జల సుందరం దర్శకత్వంలో రూ పొందించిన ‘వార్నీ! అదా విషయం?’ నాటిక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. -
వివాహిత అనుమానాస్పద మృతి
అదనపు కట్నం కోసం భర్తే చంపేశాడని బంధువుల ఆరోపణ ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు పలమనేరు టౌన్, న్యూస్‌లైన్: పలమనేరులో ఒక వివాహిత సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదనపు కట్నం కోసం భర్తే ఆమెను చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి కథనం మేరకు.. గంగాధర నెల్లూరు మండలం ఒగ్గువారిపల్లెకు చెందిన చంద్రయ్య కుమార్తె రాసా (23)కు పలమనేరుకు చెందిన సుబ్బయ్య కుమారుడు అర్జున్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. రాసా తల్లిదండ్రులు పెళ్లి చేయడమేగాక రూ.2 లక్షల నగదు, ఏడు సవర్ల నగలు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం రోజులు కాపురం సజావుగా సాగింది. నాలుగు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ అర్జున్ భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని రాసా తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. వారం రోజుల క్రితం ఆటో కొనుగోలు చేసేందుకు లక్ష రూపాయలు కావాలంటూ అర్జున్ భార్యతో గొడవపడ్డాడు. అత్తమామలు అప్పుచేసి రూ.50వేలు ఇచ్చారు. మిగిలిన రూ.50వేల కోసం వేధింపులు ప్రారంభించాడు. తన తల్లిదండ్రుల వద్ద ఇక డబ్బు లేదని రాసా చెప్పినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన భార్య ఉరేసుకుని కొన ఊపిరితో ఉందంటూ అర్జున్ చుట్టుపక్కల వారికి తెలిపాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అర్జున్ పరారయ్యాడు. కుమార్తె మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. తమ బిడ్డను అల్లుడే చంపి, నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు. మృతురాలికి ఏడాదిన్నర వయస్సు గల బిడ్డ ఉంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా!
నాటకాలు, సినిమా - రెండూ ఆయన కళ్ళు. ఇప్పటికి ఏకంగా ఎనిమిది వేల పైచిలుకు నాటకాల్లో జీవించారు. ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించారు. కానీ, విసుగూ విరామం లేని నాలుగు దశాబ్దాల సినీ జీవితం తరువాత ఇవాళ రాని అవకాశాల కోసం పరిగెత్తలేని పరిస్థితి రాళ్ళపల్లి వెంకట నరసింహారావుది. నాలుగు రాళ్ళు వెనకేసుకోని జీవితం.. ఎదిగిన బిడ్డను దూరం చేసిన దైవం.. మారుతున్న సినీ ప్రపంచపు నైజం.. వీటి మధ్య ఎవరైనా ఏం చేస్తారు? రాళ్ళపల్లి మాత్రం తనకు ఇష్టమైన రంగస్థల శాఖలో పరిశోధన చేస్తున్నారు. మానని గాయాలకు మందు వెతుక్కుంటున్నారు... అదీ ఈ అరవై ఎనిమిదేళ్ళ వయసులో! అసలు ఏమైందో, ఏమిటో, రాళ్ళపల్లి ఏం చెబుతున్నారో చదవండి... ముప్ఫై అయిదేళ్ళు యంత్రంలా పనిచేశాక, ఈ స్తబ్దత ఇబ్బందిగా ఉందా? రాళ్లపల్లి: ఇబ్బందే మరి. పని చేయడానికి అలవాటు పడ్డవాడు ఖాళీగా ఉండాలంటే పిచ్చెక్కిపోతుంది. పది పదిహేను రోజులైనా పనుంటే, మిగతా సమయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించొచ్చు. కానీ నెలంతా పనే లేకుండా ఉండటమంటే... ప్రశాంతత ఎక్కడుంటుంది. ఖర్చులేమన్నా తగ్గాయా అంటే... అదీ లేదు. 800 పై చిలుకు సినిమాలు చేశా. వాటిల్లో సవ్యంగా డబ్బులిచ్చిన వాళ్లు ఎంతమంది? పైగా మా రోజుల్లో పారితోషికాలూ తక్కువే. పెద్దగా వెనకేసుకుందీ ఏమీ లేదు. ఈ మధ్య ఏమైనా సినిమాలు చేశారా? రాళ్లపల్లి: ఏవో చేశాన్లేండి.. అన్నీ అరకొర వేషాలే. ఈ పాత్రలు చేస్తుంటే.. మేనేజర్‌గా పనిచేసిన చోటే గుమాస్తాగిరి వెలగబెడుతున్న ఫీలింగ్. నటుడు అనేవాడికి హోమ్‌వర్క్ చేసుకునే స్థాయిలో పాత్ర ఉండాలి. జాబ్ శాటిస్ఫ్యాక్షన్ ఎలాగూ లేదు. పోనీ జేబు శాటిస్ఫ్యాక్షన్ అయినా ఉండాలిగా? మా రోజుల్లో మానవతా విలువలుండేవి. ఈ రోజుల్లో అదీ లేదు. మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్నట్లు తయారయ్యారంతా. అంటే... కళాకారుడైనందుకు బాధ పడుతున్నారా? లేదు లేదు. కళాకారుణ్ణి అయినందుకు ఎప్పుడూ గర్విస్తా. ఆర్టిస్ట్‌గా నాకు అవకాశాలు తగ్గొచ్చు కానీ... ప్రేక్షకహృదయాల్లో నా స్థానాన్ని మాత్రం ఎవరూ చెరిపేయలేరు కదా. రంగస్థలంపై నేను ఇప్పటికీ బిజీగానే ఉన్నా. అసలు మీ నట ప్రస్థానం ఎలా మొదలైందో చెప్పండి? మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని రాచపల్లి. 1958లోనే హైదరాబాద్ వచ్చేశాం. టెన్త్‌తో పాటు ఇంటర్ రెండేళ్లూ నాంపల్లి ప్రభుత్వ కళాశాలలో చదివా. టెన్త్‌లో ఉన్నప్పుడే రంగస్థల ప్రవేశం జరిగింది. తొలి నాటకం ‘కన్యాశుల్కం’. కరటకశాస్త్రి శిష్యుడు ‘మహేంద్రం’ నా తొలిపాత్ర. కథకు తగ్గట్టు ఆ నాటకంలో కొంతభాగం స్త్రీగా నటించాలి. నా పాత్రకు మంచి పేరొచ్చింది. అడపాదడపా నాటకాలు వేస్తూనే సైఫాబాద్ కాలేజ్‌లో బీఎస్సీ చేశాను. మొత్తం ఎన్ని నాటకాల్లో నటించి ఉంటారు? రాళ్లపల్లి: 8 వేలకు పై చిలుకే. కాలేజ్ రోజుల్లోనే ‘మారని సంసారం’ నాటిక రాశా. అంతర్ కళాశాలల పోటీల్లో దాన్ని ప్రదర్శిస్తే.. ఉత్తమ రచన, ఉత్తమ నటుడు అవార్డులు లభించాయి. భానుమతిగారి నుంచి అందుకున్నా. బీఎస్సీ పూర్తవగానే రైల్వేలో కొన్నాళ్లు ప్యూన్‌గా పనిచేశా. అప్పుడే కేంద్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ నాటక పోటీలు పెట్టింది. ఆ పోటీల్లో మళ్లీ ఉత్తమనటుడు, ఉత్తమ రచన అవార్డులు లభించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా రైల్వే సిబ్బంది చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. నా మెడలో లావాటి మల్లెపూల దండ వేశారు. నాకు నోట మాట రాలేదు. కన్నీళ్లు వచ్చాయి. నా జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగినా, నా దృష్టిలో అదే పెద్ద సన్మానం. బీఎస్సీ చదివి.. రైల్వే ప్యూన్‌గా పనిచేశారా! రాళ్లపల్లి: మా మూడో అన్నయ్య రైల్వేలోనే పనిచేస్తారు. ‘ఖాళీగా ఉండడం దేనికి! దరఖాస్తు చేయి. మంచి ఉద్యోగం వచ్చాక మారొచ్చు’ అన్న ఆయన సలహా మేరకు ఆ ఉద్యోగానికి అప్లై చేశా. ఇంటర్వ్యూకెళితే... ‘బీఎస్సీ చదివి ప్యూన్ ఉద్యోగం ఏంటి? ఇవ్వం పో..’ అనేశారు. మారు మాట్లాడకుండా వచ్చేశా. తీరా చివరకు ఎంపికైన అభ్యర్థుల జాబితా చూస్తే.. అందులో తొలి పేరు నాదే. తొలిరోజే మా సూపరింటెండెంట్ గంటయ్యగారు మా బేస్మెంట్లో ఉన్న బల్లలు, కుర్చీలు నాతో మోయించేశారు. కాఫీ కప్పులు కూడా కడిగించారు. కేఏ చంద్రశేఖరన్ అని... అప్పట్లో మా పై అధికారి. ఓ సందర్భంలో ఆయన ఏదో అడిగితే, సీరియస్‌గా ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పా. ‘ఎవడయ్యా వీడు ఇంగ్లిష్‌లో సమాధానమిస్తున్నాడు’ అని తోటి ఉద్యోగుల్ని అడిగారాయన. ‘చదువుకున్నవాడండీ... తప్పని పరిస్థితుల్లో ఈ చిరుద్యోగం చేస్తున్నాడు.. ’ అన్నారు వాళ్లు. ‘అవునా... ఇక నుంచి ఏ పనులు పడితే ఆ పనులు అతనికి చెప్పొద్దు. అతని చదువుకు తగ్గట్టుగా పనులుండాలి’ అని పురమాయించారు. తర్వాత ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’లో జాబ్ వచ్చింది. అప్పుడు చంద్రశేఖరన్గారే మంచి ముహూర్తం చూసి, ఉద్యోగం నుంచి రిలీవ్ చేశారు. 1970 జనవరి 4న ఢిల్లీ వెళ్లి ఉద్యోగంలో చేరా. కుటుంబనియంత్రణ, జాతీయసమైక్యత.. ఇలా వివిధ అంశాలపై నాటకాలు వేస్తూ రాష్ట్రమంతా తిరగడం నా డ్యూటీ. ఏడాదికి వందకు తగ్గకుండా ప్రదర్శనలివ్వాలి. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం దాకా తిరిగా. అలా ఎనిమిదేళ్లు చేశా. ‘చుట్టుముట్టండి, ధర్మశాల, చౌరస్తా’ నాటకాలన్నీ వేశా. బుర్రకథకు వంత కూడా చెప్పేవాణ్ణి. మరి సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? రాళ్లపల్లి: కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘హారతి’ నవలను కొత్త హీరోహీరోయిన్లతో సినిమాగా చేయనున్నట్లు పత్రికా ప్రకటన వచ్చింది. కె.ప్రత్యగాత్మ దర్శకుడు. ‘హీరో వేషాలకు మీరెలాగూ పనికిరారు. ఇంకేదైనా వేషానికి ఉపయోగపడతారేమో.. ఓ ఉత్తరం ముక్క రాయొచ్చుగా!’ అన్నది నా అర్ధాంగి స్వరాజ్యలక్ష్మి. ఓ రాయి వేసి చూద్దామని ఆ ప్రకటన మీదే ఉన్న అడ్రస్‌కి ఉత్తరం రాశా. ‘నా హైట్ ఆరడుగులు ఉండదు. నా ముఖం అందంగా చంద్రబింబంలా ఉండదు. పదిహేనేళ్ల రంగస్థల అనుభవమైతే.. ఉంది. నటునిగా అవకాశం ఉంటే చూద్దురు’ అని... నేను వేసిన నాటకాల జాబితా కూడా రాసి పోస్ట్ చేశా. ఆ ఉత్తరం ప్రత్యగాత్మగారికి బాగా నచ్చింది. వెంటనే టెలిగ్రాం వచ్చింది. కబురు తీసుకొని మద్రాస్ రెలైక్కి... ప్రసాద్ స్టూడియోలో అడుగుపెట్టా. లోపల రాచకొండ విశ్వనాథశాస్త్రి, సి.నారాయణరెడ్డి, ప్రత్యగాత్మ కూర్చొని ఉన్నారు. నాకు మేకప్ టెస్ట్ చేశారు. ‘నువ్వు వేసిన నాటకాల్లో ఒక డైలాగ్ చెప్పు’ అన్నారు ప్రత్యగాత్మ. చెప్పాను. ‘పనికొస్తాడు..’ అన్నారు సినారె, రాచకొండ. అలా ‘స్త్రీ’(1973) సినిమాలో తొలి అవకాశం దక్కింది. ఆ తర్వాత అరకొర పాత్రలు కొన్ని చేసినా.. నా కెరీర్‌ని మలుపు తిప్పింది ‘ఊరుమ్మడి బతుకులు’(1976). అందులో నా పాత్ర పేరు తాగుబోతు హరిశ్చంద్రుడు. ఆ పాత్రకు నంది అవార్డు వచ్చింది. తర్వాత ఏడాది విడుదలైన ‘చిల్లరదేవుళ్లు’(1977)లోని వీరిగాడి పాత్ర కూడా గుర్తింపునిచ్చింది. తర్వాత మళ్లీ అంత పేరు తెచ్చిన సినిమా ‘చలిచీమలు’(1978). నటునిగా మీకు సంతృప్తినిచ్చిన పాత్ర? రాళ్లపల్లి: ‘సీతాకోక చిలుక’.. గొప్ప పాత్ర. ‘అభిలాష’ గుర్తుంచుకోదగ్గ పాత్ర. ‘కంచుకాగడా’.. గద్దర్ని పోలి ఉండే విప్లవకారుని పాత్ర. ‘రేపటిపౌరులు’.. సింప్లిసిటీ మినిస్టర్ పాత్ర. అర్ధరాత్రి స్వతంత్రం, భూపోరాటం, అన్వేషణ, సగటు మనిషి’, మణిరత్నం ‘బొంబాయి’... ఇలా చాలానే ఉన్నాయి. ‘బొంబాయి’లోని హిజ్రా పాత్రకు మణిరత్నం దృష్టిలో మీరెలా మెదిలారు? రాళ్లపల్లి: ‘తెలుగు నటుల్లో ఈజ్ ఉన్నవాడు కావాలి.. నటిస్తున్నట్లు కనిపించకూడదు. అలాంటి నటుడెవరైనా ఉన్నారా?’ అని మణిరత్నం అడిగితే... రామ్‌గోపాల్‌వర్మ నా పేరు సూచించారట. నిజానికి అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో హిజ్రాగా చేశా. అయితే... వాటి ట్రీట్మెంట్ అంత నాచురల్‌గా అనిపించదు. అవన్నీ ఒక ఎత్తు... ‘బొంబాయి’లోని పాత్ర మరో ఎత్తు. ఆ పాత్రలో చూసి అందరూ షాకయ్యారు! రాళ్లపల్లి: నన్ను గుర్తు పట్టనివాళ్లు కూడా ఉన్నారు. ‘బొంబాయి’లో నేను చేశానంటే.. ‘ఎక్కడున్నారు?’ అనడుగుతారు. మిగిలిన సినిమాల్లా కాకుండా ఆ సినిమాలో నా డ్రస్కోడ్ కూడా భిన్నంగా, సహజంగా ఉంటుంది. ఉత్తరాది పద్ధతి ప్రకారం పంజాబీ డ్రస్ తొడిగించి ఓ పక్క కూర్చోబెట్టారు. మేకప్ వేసి కూడా రెండ్రోజుల పాటు నాపై షాట్స్ తీయలేదు. ఇతర షాట్స్ తీస్తుంటే చూస్తూ కూర్చునే వాణ్ణి. షూటింగ్ చేస్తూ మధ్య మధ్యలో నా వైపు చూస్తూ ఉండేవారు మణిరత్నం. మూడోరోజున మేకప్ వాళ్లను పిలిచి ‘పంజాబీ డ్రస్ తీసేయండి’ అన్నారు. పాత చీర తెప్పించి కట్టించారు. ‘ఇప్పుడు నిజంగా హిజ్రాలా ఉన్నా’రన్నారు మణిరత్నం. మానవత్వం, భావోద్వేగాలు హిజ్రాలకూ ఉంటాయని చెప్పే ఆ పాత్ర ఓ రకమైన బాధ కలిగిస్తుంది. మీ కుటుంబంలో ఆర్టిస్టులున్నారా? కళలు ఎలా అలవడ్డాయి మీకు? రాళ్లపల్లి: నిజంగా దైవదత్తమే. మా ఇంట్లో ఆర్టిస్టులైతే ఎవరూ లేరు. మా నాన్నగారు స్కూల్ మాస్టర్. పేరు రాళ్లపల్లి వెంకట్రావు. అమ్మ గృహిణి. పేరు కామేశ్వరమ్మ. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాకు ఇద్దరు అక్కయ్యలు, ముగ్గురు అన్నయ్యలు. నేనే అందరికంటే చిన్నవాణ్ణి. స్కూల్ మాస్టరైన నాన్న జీతం 14 రూపాయలు. ఆ జీతంతోనే ఏ బాదరబందీ లేకుండా మా జీవితాలు సాగిపోయేవి. ఎల్కేజీలో చేరాలంటే యాభైవేల రూపాయలు కట్టే దౌర్భాగ్యపు పరిస్థితి అప్పట్లో లేదు. స్కూల్ ఫీజులు ఉచితం. కరెంటూ ఉండేది కాదు. అందరూ కిరోసిన్ దీపాల ముందు కూర్చుని చదువుకున్నవాళ్లమే. ఎందుకో తెలీదు కానీ చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ. ఆ ఇష్టమే కళాకారుణ్ణి చేసింది. మీ ఇంటి పేరు రాళ్లపల్లి. మరి మీ అసలు పేరు? రాళ్లపల్లి: రాళ్లపల్లి వెంకట నరసింహారావు. తొలినాళ్లలో ‘ఆర్.వి.నరసింహారావు’ అని టైటిల్స్‌లో వేసేవారు. ‘తూర్పు వెళ్లే రైలు’ చేస్తున్నప్పుడు దర్శకుడు బాపు గారు.. ‘ఎందుకయ్యా అంత పెద్ద పేరు? ‘రాళ్లపల్లి’.. బావుందిగా!’ అన్నారు. ‘నరికేయండి సార్’ అన్నాను. అప్పట్నుంచి రాళ్లపల్లి నా పేరై కూర్చుంది. ఈ వయసులో ఎం.ఫిల్ చేస్తున్నట్టున్నారు! రాళ్లపల్లి: ఇంతకాలం గురువులు చెప్పింది చేశా. నిజానికి నాకు తెలిసిందెంత? ఇప్పటి దాకా నేను చేసిందేమిటి? చేయాల్సింది ఎంత ఉంది? అనే విషయాలు తెలుసుకోవడానికే ఈ ఎం.ఫిల్. తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల శాఖలో చేస్తున్నా. ఈ వయసులో ఈ చదువు దేనికి? అనే కోణంలో మాత్రం ఆలోచించొద్దు. నా దృష్టిలో ఈ యూనివర్సంతా యూనివర్సిటీనే. అందులో మనిషి అనేవాడు, ముఖ్యంగా కళాకారుడు నిరంతర విద్యార్థి. అన్నీ చెప్పారు కానీ... మీ పిల్లల గురించి చెప్పలేదు? రాళ్లపల్లి: నాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి విజయమాధురి. రెండో అమ్మాయి రష్మిత. పెద్దమ్మాయి 1994లో చనిపోయింది. నా జీవితంలోనే అతి పెద్ద దుర్ఘటన అది. మెడిసన్ చదవడానికి రష్యా వెళ్లాలి. శుభ్రంగా... మద్రాస్‌లో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగొచ్చు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి రష్యాలో దిగొచ్చు. కానీ ఆ అమ్మాయి అలా కాకుండా ఢిల్లీ దాకా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రైన్లో వెళతానంది. తన కోరిక కాదనలేక స్వయంగా నేనే ట్రైన్ ఎక్కించా. నాకు మద్రాసులో చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటిని ముగించుకొని మరుసటి రోజు ఫ్లైటెక్కి ఢిల్లీ వెళ్లి... అక్కడ అమ్మాయిని రష్యా ఫ్లయిట్ ఎక్కించి వీడ్కోలు ఇవ్వాలనుకున్నా. కానీ నాకంత అవకాశం ఇవ్వలేదు దేవుడు. ట్రైన్ ఢిల్లీ చేరేలోపే ఆ అమ్మాయికి వైరల్ ఫీవర్ వచ్చింది. రైల్లోనే ప్రాణాలు వదిలింది. 1994 సెప్టెంబర్ 29.. నా జీవితంలో అత్యంత దుర్దినం. అప్పట్నుంచీ డిప్రషన్‌లోకి వెళ్లిపోయాను. ఇక రెండో అమ్మాయి విషయానికొస్తే ఎం.సి.ఏ పాసయ్యింది. పెళ్లి కూడా చేసేశా. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటారు. ఇప్పుడొస్తున్న సినిమాలైనా చూస్తుంటారా? రాళ్లపల్లి: 1994 సెప్టెంబర్ 22న ‘బొబ్బిలిసింహం’ ప్రివ్యూ చూశాను. ఆ తర్వాత వారం రోజులకు మా పెద్దమ్మాయి హఠాన్మరణంతో నిరాశానిస్పృహలు ఆవరించాయి. థియేటర్‌కెళ్లి సినిమాలు చూడడం మానేశా. ఈ మధ్య మా తనికెళ్ల భరణి పిలిస్తే.. కాదనలేక ‘మిథునం’ చూశా. ఈ ఇరవై ఏళ్లలో థియేటర్లో చూసిన సినిమాలు ఈ రెండే. టీవీల్లో వస్తున్నప్పుడు మాత్రం చూస్తుంటాను. నచ్చకపోతే చానల్ తిప్పేస్తా. ఇప్పుడున్నంత విశృంఖలత్వం మా రోజుల్లో లేదండీ. వ్యాపారాత్మక ధోరణే తప్ప కళాత్మక దృక్పథంతో ఒక్కరూ ఆలోచించడం లేదు. ఒకవేళ ఆలోచించినా... వాళ్లకు అవకాశాలు రావు. అదీ పరిస్థితి. - బుర్రా నరసింహ నేను వంట బాగా చేస్తానని చాలామంది అంటుంటారు. కమల్‌హాసన్, వంశీ లాంటి వాళ్లకు నా వంట చాలా ఇష్టం. ‘మీకెప్పుడూ చేతినిండా సినిమాలుండాలనేది నా ఆకాంక్ష. ఒక వేళ లేకపోతే.. నా దగ్గరకొచ్చేయండి. వారానికి రెండ్రోజులు వండిపెట్టండి చాలు. జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాను’ అనేవాడు కమల్ హాసన్. ఇక వంశీ అయితే... షూటింగ్ స్పాట్‌లోకి కూరగాయల్ని తెప్పించి నా ముందు పడేసేవాడు. ‘మీకు సాయంత్రం దాకా షాట్స్ లేవు. ఈ పనిలో ఉండండి’ అనేవాడు. నాతో తనకు చనువెక్కువ. వీళ్లు మాత్రమే కాదు. సినీ ప్రముఖులందరూ నా చేతి వంట రుచి చూసినవారే.