అందరం ఒక్కటవుదాం

KTR Road Show At Rajanna Sircilla District - Sakshi

ఢిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకుందాం 

దుబ్బాక, సిరిసిల్ల రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్‌ 

కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఢిల్లీదే పెత్తనం 

తెలంగాణపై కేసీఆర్‌కున్న ప్రేమ వాళ్లకు ఉండదు 

దుబ్బాక టౌన్‌/సిరిసిల్ల: ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టవద్దని, కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీయే పెత్తనం చెలాయిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ చెప్పారు.కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని చావగొట్టిందని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులొస్తాయని 50 ఏళ్లు వెనక్కిపోతామని అన్నారు. అందరం ఒక్కటై ఢిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు పొరపాటున కూడా ఓటు వేయవద్దని కోరారు. తెలంగాణపై సీఎం కేసీఆర్‌కున్న ప్రేమ ఢిల్లీ రాహుల్‌ గాంధీకి, మోదీకి ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన ప్రసంగించారు.

మీకెందుకు చాన్స్‌ ఇయ్యాలి? 
‘కాంగ్రెసోళ్లు ఒక్క చాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నారు. 55 ఏళ్లలో 11 సార్లు అవకాశం ఇస్తే ఏం వెలగబెట్టారు? ఇప్పుడు మళ్లీ చాన్స్‌ ఇచ్చి ఎరువుల కోసం దుకాణాల ముందు క్యూలో నిలబడాలా? కరెంటు కోసం అర్ధరాత్రి మళ్లీ పొలాల కాడ పడుకోవాలా? అలాంటి కాంగ్రెస్‌ దరిద్రపు పాలన మనకు మళ్లీ కావాలా? ధరణిని తొలగించి మళ్లీ పట్వారీ విధానం అమలు చేస్తామంటున్నారు.

రాహుల్, రేవంత్‌లకు ఎవసం, ఎద్దు తెల్వదు.. ఉత్తమ్‌ రైతుబంధు దుబారా అంటడు.. భట్టి ధరణి వద్దు అంటాడు..ధరణి కావాలా? దళారులు కావాలా? ఎట్లున్న తెలంగాణ ఎట్ల అయ్యింది? రైతులకు కడుపు నిండా 24 గంటల కరెంట్, సాగునీరు, ఇంటింటికీ తాగునీరు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ సాయం ఇలా ఎన్నో మంచి పనులు కేసీఆర్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వస్తే.. ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నాయి. ఈ పనులన్నీ కాంగ్రెసోళ్లకు కనపడ్తలేవా..? మళ్లీ మీకెందుకు చాన్స్‌ ఇయ్యాలి?..’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

కత్తిపోటు రాజకీయానికి ఓటుతో బుద్ధి చెప్పాలి 
‘పార్టీ దుబ్బాక అభ్యర్థి ప్రభాకరన్నను ఎన్నికల్లో ఎదుర్కోలేక కత్తితో పొడిచిండ్రు. కత్తిపోటు రాజకీయాలను ఓటుతో ఎదుర్కోవాలి. రఘునందన్‌రావును చిత్తుగా ఓడించి ప్రభాకరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి..’ అని కేటీఆర్‌ కోరారు. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. 

అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ కార్డులు 
‘డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు రాగానే, సీఎంగా కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జనవరిలో కొత్త రేషన్‌ కార్డులు, ఆసరా పెన్షన్లు అర్హులకు అందిస్తాం. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని సవరించి మరింత మందికి పెన్షన్‌ అందిస్తాం. కోడళ్లకు సౌభాగ్య లక్ష్మీ పేరిట పెన్షన్లు ఇస్తాం. తెల్ల రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందిస్తాం.

రైతుబంధు ను ఎకరానికి ఏటా రూ.16 వేలు చొప్పున ఇస్తాం..’ అని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ‘తొమ్మిదిన్నరేళ్లలో ఎ న్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమ లు చేశాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు.. గుజరాత్‌ నుంచి బీజే పీకి పైసలు వస్తున్నాయి. అంగట్లో పశువులను కొ న్నట్లు కొంటున్నారు. మోదీ, అమిత్‌ షా, రాహుల్, సిద్ధరామయ్య, షేర్‌లు, బబ్బర్‌ఖాన్‌లు ఎంతమంది వచి్చనా సరే సింహం సింగిల్‌గా వచ్చినట్లు కేసీ ఆర్‌ దూసుకుపోతున్నారు..’ అని పేర్కొన్నారు.

కారు ఉండగా బేకార్‌గాళ్లెందుకు 
రాంగోపాల్‌పేట్‌/కంటోన్మెంట్‌ (హైదరాబాద్‌): బక్క పలుచని కేసీఆర్‌ను ఓడించి తెలంగాణ గొంతు పిసికేందుకు ఢిల్లీ నుంచి షేర్‌లు, శంషేర్‌లు వస్తున్నారని, కారు ఉండగా ఇలాంటి బేకార్‌గాళ్లు మనకెందుకని కేటీఆర్‌ అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని మహంకాళి దేవాలయం వద్ద, కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని అన్నానగర్, పికెట్‌ చౌరస్తాల్లో నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన ప్రసంగించారు.  

కంటోన్మెంట్‌ సమస్యలకు విలీనమే పరిష్కారం: ‘కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కంటోన్మెంట్‌ అభివృద్ధిలో వెనుకబడిన మాట వాస్తవమే. జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తేనే కంటోన్మెంట్‌ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది..’ అని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇటీవల సంచలనంగా మారిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత, డబుల్‌ బెడ్‌రూమ్‌ బాధితుడి సంభాషణల వీడియోలపై ఆయన స్పందించారు. బీజేపీ వాళ్లు చిల్లర వీడియోలతో బదనాం చేస్తున్నారని, సాటి ఆడకూతురుని అవమానించిన బీజేపీని బొందపెట్టాలని మహిళలను ఆయన కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కంటోన్మెంట్‌ అభ్యర్థి లాస్య నందిత తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-11-2023
Nov 22, 2023, 04:20 IST
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వాళ్లు కొత్త డ్రామా మొదలుపెట్టారని.. ఆ పారీ్టకి...
22-11-2023
Nov 22, 2023, 04:12 IST
హుస్నాబాద్‌/చిగురుమామిడి/ అక్కన్నపేట/కోహెడ: కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, మూడు గంటలు కరెంట్‌ ఇచ్చే కాంగ్రెస్‌...
21-11-2023
Nov 21, 2023, 19:16 IST
సాక్షి, మంచిర్యాల : ఎన్నికల్లో  గెలవలేకే తనపై  ఐటీ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌...
21-11-2023
Nov 21, 2023, 18:20 IST
సాక్షి, సిరిసిల్ల : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్...
21-11-2023
Nov 21, 2023, 18:02 IST
సాక్షి, మధిర : ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సీల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటర్‌​ ఇచ్చారు. కేసీఆర్‌ మధిర...
21-11-2023
Nov 21, 2023, 13:36 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు సొంత పార్టీలో కొందరి...
21-11-2023
Nov 21, 2023, 12:04 IST
బోడుప్పల్‌: కాంగ్రెస్‌ పార్టీ 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకురాలు చామకూర...
21-11-2023
Nov 21, 2023, 10:50 IST
సాక్షి, పెద్దపల్లి: మంథని అసెంబ్లీకి ప్రధాన పార్టీల తరపున నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నా.. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ...
21-11-2023
Nov 21, 2023, 10:18 IST
మహబూబ్‌నగర్‌: శాసనసభ ఎన్నికలలో భాగంగా పంపిణీ చేసే ఓటరు సమాచార చీటీలను జాగ్రత్తగా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం...
21-11-2023
Nov 21, 2023, 10:16 IST
కరీంనగర్‌రూరల్‌: ‘అన్నా.. మంచిగున్నవానే.. ఈ ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్‌.. గుర్తుంది కదా..? జరంత తప్పకుండా అందరూ రావాలే. వదినను...
21-11-2023
Nov 21, 2023, 09:31 IST
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌ / సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది....
21-11-2023
Nov 21, 2023, 09:28 IST
యాభయ్యేళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌...
21-11-2023
Nov 21, 2023, 09:14 IST
సాక్షి, మెదక్‌: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే...
21-11-2023
Nov 21, 2023, 09:04 IST
సాక్షి, మెదక్‌: తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన తండాల అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని...
21-11-2023
Nov 21, 2023, 08:58 IST
సాక్షి, మెదక్‌: శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆయా రాజకీయ పార్టీల్లో నేతల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన...
21-11-2023
Nov 21, 2023, 08:54 IST
హైదరాబాద్: ఉప్పల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అన్ని ఫ్లాట్‌లలో మొత్తం 33 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల కోసం ప్రధాన పార్టీల...
21-11-2023
Nov 21, 2023, 08:00 IST
జడ్చర్ల టౌన్‌: ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచినా రికార్డు నమోదవుతుంది. 1962లో జడ్చర్ల నియోజకవర్గం...
21-11-2023
Nov 21, 2023, 05:02 IST
కాంగ్రెస్‌తో 58 ఏళ్లు గోసపడ్డం.. ఆ రాజ్యం మళ్లీ కావాలా? వాళ్లది ‘భూమేత’.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం ఎన్నికలు కాగానే ఆర్టీసీ...
21-11-2023
Nov 21, 2023, 04:41 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున డిసెంబర్‌ నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో...
21-11-2023
Nov 21, 2023, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ ప్రజల రక్తం తాగిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర... 

Read also in:
Back to Top