
మేనిఫెస్టో రూపకల్పనలో ఎవరిలో చిత్తశుద్ధి ఉందో ప్రజలకు తెలుసు
చంద్రబాబు ఇచ్చేవన్నీ అబద్ధపు హామీలు
ప్రజల కోసం అమలు చేయగల వాటినే జగన్ మేనిఫెస్టోలో పెట్టారు
జగన్‌కు ఓటేయొద్దనడానికి, చంద్రబాబుకి వేయమనడానికి ఒక్క కారణం కూడా లేదు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు చేస్తున్నది దు్రష్పచారమే
ఈ చట్టం అమలులో ఉన్న 90 దేశాల్లో భూ వివాదాలే లేవు
విలేకరుల సమావేశంలో మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఎన్‌ఆర్‌ఐలు
టీడీపీ గెలిస్తే ఈనాడు ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానన్న జర్నలిస్ట్ తిలక్
ఓడిపోతే రామోజీ సంస్థలపై ఆయనే సీబీఐ విచారణ కోరగలరా అని సవాలు
సాక్షి, అమరావతి: ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తుంటే.. ప్రజల కోసం జగన్ అమలు చేయగల వాటినే మేనిఫెస్టోలో పెట్టారని, ఈ విషయంలో ఇద్దరిలో ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలకు బాగా తెలుసని పలువురు మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఎన్‌ఆర్‌ఐలు, జర్నలిస్టులు స్పష్టం చేశారు. వీరంతా శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ పార్టీలు రకరకాల హామీలతో ఓటర్లను అయోమయంలోకి తీసుకెళ్లడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేయడమే మనం ఇంతవరకు చూశామని, కానీ అన్ని హామీలను అమలు చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సుపరిపాలన అంటే ఇదీ అని చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ విద్య, వైద్యం వంటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం, భరోసా అని అన్నారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలనతో బేరీజు వేసుకొంటే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని, రాష్ట్రం ఇప్పుడే సరైన దిశలో ఏపీ పయనిస్తోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పారు. వైఎస్ జగన్‌కు ఎందుకు ఓటేయాలో చెప్పడానికి చాలా కారణాలున్నాయని, వేయొద్దని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదని తెలిపారు. చంద్రబాబుకి ఓటేయమనడానికి ఒక్క కారణం కూడా లేదని చెప్పారు. అందువల్ల అందరం వైఎస్సార్‌సీపీకి ఓటేద్దామని పిలుపునిచ్చారు. ప్రత్యర్థులపై దాడులను ఈసీ అరికట్టి, ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
దమ్మున్న నాయకుడు సీఎం జగన్
తన 63 ఏళ్ల జీవితంలో ఏ పార్టీకీ బహిరంగంగా మద్దతివ్వలేదని, కానీ.. ‘నేను మీకు మేలు చేసి ఉంటే, నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి‘ అని చెప్పగలిగే గుండె ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడైన సీఎం వైఎస్ జగన్ కోసం బయటకు వచ్చి మద్దతిస్తున్నానని సీనియర్ న్యాయవాది చోడిశెట్టి మన్మధరావు చెప్పారు. సీఎంను కలవడం కాదు.. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను పంపిన నాయకుడు జగన్ అని తెలిపారు. జగన్‌ను ఏమీ చేయలేక బాబు జాతీయ పార్టీల దగ్గర్నుంచి చిన్న చిన్న పార్టీల వరకూ అందరితో కూటమి కట్టారన్నారు.
భూహక్కు చట్టంపై అపోహలు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని న్యాయవాది సీడీ భగవాన్ చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజలకు ధారబోసి, వేలాది ఎకరాలను ప్రజలకు ఇచ్చిన సీఎం జగన్ ప్రజల భూములు లాక్కుంటారా అని ప్రశ్నిం చారు. అసలు జగన్ మాత్రమే ఈ చట్టాన్ని తెచ్చారని నిరూపించగలరా, లేదంటే చంద్రబాబు, పవన్ వారి పార్టీల అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు.
30 రకాల భూ రికార్డులన్నిటినీ క్రోడీకరించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
30 రకాల భూ రికార్డులన్నింటినీ క్రోడీకరించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని, దాని ప్రకారం పట్టాదారు పాసు బుక్ ఇస్తే ప్రభుత్వం ఆ భూమికి ఇన్సూ్యరెన్స్ కల్పిస్తుందని న్యాయవాది షేక్ సయ్యద్ బాబు వివరించారు. పైగా ఈ ప్రతిపాదన నీతి ఆయోగ్ చేసిందని, ఇదే చట్టాన్ని అమలు చేస్తున్న 90 దేశాల్లో భూ వివాదాలు లేవని తెలిపారు.
ప్రజలు ఇది గమనించాలి
ఇవి బైపోలార్ ఎలక్షన్లని, ఏ నాయకుడు తమకు అవసరమైనవన్నీ సమకూర్చారనేది ప్రజలంతా గమనించాలని ప్రవాసాంధ్రుల సంఘం అధ్యక్షుడు వెంకట్ మేడపాటి కోరారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో తమ బృందం బస్సులో ఊరూరా పర్యటించిందని, ప్రజలు వైఎస్ జగన్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని ఎన్‌ఆర్‌ఐ కార్తీక్ యల్లాప్రగడ తెలిపారు.
విశ్వసనీయతకు, మోసానికి మధ్య ఎన్నికలు
ఇవి విశ్వసనీయతకు, మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై జరుగుతున్నది కేవలం దుష్పచారమని, ప్రజలు, రైతులు ఆ విష ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జగన్ పధకాల వల్ల రాష్ట్ర జీడీపీ పెరిగిందన్నారు.
ఆర్టీసీకీ మేలు చేశారు
సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని పేదల్లో ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు, ఉద్యోగులకు కూడా మేలు చేశారని ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ ఉన్నతాధికారి ఎ.కోటేశ్వరరావు చెప్పారు. 2019కి ముందు ఏటా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున దాదాపు రూ.6 వేల కోట్ల అప్పుల్లోకి ఆర్టీసీ వెళ్లిపోయిందని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఫలితంగా అప్పులు సగానికి తగ్గాయని వెల్లడించారు.
కరోనా సమయంలో బాబు, పవన్ ఎక్కడున్నారు?కరోనా సంక్షోభ సమయంలో బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని సీనియర్ జర్నలిస్టు తిలక్ నిలదీశారు. ఆపత్కాలంలో వీరు రాష్ట్రంలో ఎందుకు కనపడలేదన్నారు. ప్రజలతో పాటు నిలబడి ఆప్రమాదాన్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని కాపాడింది సీఎం జగన్ అని చెప్పారు. బాబు కేవలం ఓట్ల కోసమే హామీలిస్తారని, సీఎం జగన్ మాత్రం ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం హామీలిస్తున్నారని వివరించారు. టీడీపీ గెలిస్తే ఈనాడు ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని, ఓడిపోతే రామోజీ ఆయన సంస్థలపై సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారు.