కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి | Illegal Cases on YSRCP MLA Tatiparthi Chandrasekhar | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి

Nov 18 2024 3:27 PM | Updated on Nov 18 2024 4:04 PM

Illegal Cases on YSRCP MLA Tatiparthi Chandrasekhar

సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్‌ వేదికగా నారా లోకేష్‌పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. 

ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. 
 

ఏపీలో YSRCP నాయకులపై  కూటమి సర్కారు వేధింపులు
 

Advertisement
 
Advertisement
Advertisement