హైదరాబాద్‌లో లివింగ్ రిలేషన్‌షిప్‌లపై వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు! | Former Congress Mp Vh Hanumantha Rao Comments On Living Relationship Culture In Hyderabad | Sakshi
Sakshi News home page

Living Relationship: హైదరాబాద్‌లో లివింగ్ రిలేషన్‌షిప్‌లపై వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు!

Jun 25 2025 6:01 PM | Updated on Jun 25 2025 6:25 PM

Former Congress Mp Vh Hanumantha Rao Comments On Living Relationship Culture In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: లివింగ్ రిలేషన్‌షిప్ అనేది ఈ కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది ఇద్దరు వ్యక్తులు వారి ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే భార్యభర్తలుగా కలిసి జీవిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందే తమ భాగస్వామితో కలిసి జీవిస్తున్నారు. దీనిని లివింగ్ రిలేషన్‌ షిప్‌ అని అంటారు.

తాజాగా, ఈ లివింగ్‌ రిలేషన్‌ షిప్‌పై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ వల్లే ప్రేమ హత్యలు  పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్‌ వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు.

‘హై టెక్ సిటీలో కొలివింగ్‌ను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నా. ఒకే హాస్టల్‌లో ఆడపిల్ల,మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారు.హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలి. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం వీటి మీద దృష్టి పెట్టాలి. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండేవి. ఇప్పుడు సొంత భర్తను, కూతురు తల్లిని చంపడం అనేది దారుణం. ఇప్పుడు లవ్ మర్డర్స్‌ జరుతున్నాయి. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్. సమాజం ఎటు వైపు పోతుందని భయమేస్తుంది.

నక్షలైట్ల హత్యల విషయంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు మాట్లాడుతారు. ప్రేమ హత్యలపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇలాంటి ప్రేమ హత్యల్ని హ్యూమన్ రైట్స్ టేక్ అప్ చేయాలి. సైకాలజిస్టులు, ఇంటలెక్చవల్స్ ఆలోచన చేయాలి. ఎక్కడో తప్పు జరుగుతుందో తెలుసుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement