కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మె‍ల్యేలు | Former BJP MLAs join Congress in karnataka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మె‍ల్యేలు

Apr 19 2024 7:19 PM | Updated on Apr 19 2024 7:38 PM

Former BJP MLAs join Congress in karnataka - Sakshi

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్‌లో చేరారు. గుత్తేదార్ కలబురగి జిల్లా అఫ్జల్‌పూర్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేశారు.

ఈ నెల ప్రారంభంలో మాలికయ్య గుత్తేదార్‌ తన సోదరుడు నితిన్ వెంకయ్య గుత్తేదార్‌ను బీజేపీలోకి చేర్చుకోవడంతో గుత్తేదార్ కలత చెందారు.పలు నివేదికల ప్రకారం, కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి ఖర్గే కుమారుడు  ప్రియాంక్ ఖర్గే .. శారదామోహన్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 

శారదా మోహన్ శెట్టి 2013 నుండి 2018 వరకు ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆమె బీజేపీలోకి మారారు. కాగా, మల్లిఖార్జున్‌ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కలబురగి (గుల్బర్గా) నుంచి పోటీ చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement